Skip to main content

వాస్తు లో కుల బీజాలు !!!


వాస్తు లో కుల బీజాలు !!!

హిందూ సమాజం లో లోతుగా వేల్లూరుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి. గ్రామా /పట్టణ/ నగరాల లో వర్గం (కులం/వర్ణం) దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లోచెప్ప బడింది.సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి,జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది. దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా ,కులాలగా విభజింప బడినది.వృత్తు మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్నిశాశ్వితం చేసాయి.
వాస్తు
శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి.
బ్రాహ్మణ
, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు, రుచి,వాసన, ఎలా వుండాలోకుడా చెప్పబడినది.

౧. బ్రాహ్మణలు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి
౨. క్షత్రియ : తూర్పుదిశలో ఇల్లు/ వాకిలి
౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి
౪. శూద్ర : పడమరదిశలో ఇల్లు/ వాకిలి
ఈ దిశలు ఊరి మధ్య బిందువు (బొడ్డురాయి) ని కేంద్రంగా చేసుకొని వుంటాయి.
ఇంకా కులాలను/వర్ణాలను బట్టి వారు నివసించ వలిసిన నేలకు ఉండవలిసిన లక్షణాలు క్రింది పట్టికలో వరుసగా బ్రాహ్మనాది క్రమంలో చూపబడ్డాయి.

నేలరంగు : .తెలుపు,.ఎరుపు, .పసుపు, .నలుపు.

మట్టి రుచి: .తీపి, .కషాయం, .వగరు/పులుపు,.చెడు

నేలవాసన :.సువాసన, .రక్తపు వాసన,.అన్నపు వాసన,.దుర్గంధం

నేల వాలు: ౧.ఉత్తరం, ౨.తూర్పు, ౩.దక్షిణం, ౪.పడమర.

ఇంటి పొడవు,వెడల్పు లు కుడా బ్రాహ్మణాది జాతి బేధాన్ని బట్టి ఉంటాయి.

వీరితో పాటు మిగిలిన ఇతర నిమ్నవర్ణాలు, సంకర కులాలు వారు ఎక్కడ నివాసం వుండాలో చెప్పబడినది.
గ్రామ
, నగరాలలో ఆగ్నేయ, నైరుతి, వాయువ్య దిశలలో - చాకలి,మంగలి,జాలరి,మాదిగ, వర్ణ సంకరం చెందిన వారు నివాసం వుండాలి.
ఇంకా సంఘ బహిష్కరణ పొందిన వారు కూడా జనావాసాలలో "మూలల్లో" నివాసం వుండాలనిఆదేశించారు.అందుకేనేమో మూలల్లో నివసించే వారిని మూలవాసులు అన్నారు. వారినే నేడు " మాలలు " గా పిలుస్తున్నారు.
ఆనాటి ఈ పద్దతులు అన్ని తు.చ. తప్పకుండా అమలు జరిగేవన్నదానికి నిదర్శనగా ఆయా వర్గాలు వారికి కేటాయించిన ప్రదేశాలలో ఈ నాటికి నివశించుతూ ఉండటం గమనార్హం.
మాల,మాదిగవాడలు, చాకలి,కమ్మరి,కుమ్మరిపాలెంలు, బ్రాహ్మణ, కోమట్ల బజారులు దీనికి సజీవ సాక్షం గా నేటికి మనముందు ఉన్నాయి.

వాస్తులో కుల విభజనను బట్టి చేసిన నేలరంగు, రుచి, వాసన,వాలు చూసి ,వాటిని అనుసరించి ఈనాడు ఇల్లు /వాకిలి ఏర్పరుచు కోవటం సాద్యం కాని సంగతి. వాటిని పాటించాలనుకోవటం అజ్ఞానం.ఇలాంటి కాలం చెల్లిన విషయాలు ఎన్నో వాస్తు లో అంతర్లీనంగా దాగి ఉన్నాయన్నది వాస్తవం.
ఇలాంటి విషయాలను ఈనాడు మనం పాటించకపోయినా మనకు ఎలాంటి కష్టం,నష్టం వాటిల్లలటం లేదన్నది గమనార్హం.
అలాగే వాస్తు లో ఇలాంటి విషయాలే తప్పు ,మిగిలిన విషయాలన్నీ ఒప్పు అనటం అజ్ఞానం.సరిగా అర్థం చేసుకునుటలోనే విజ్ఞత ఉంటుంది.తాతల నాటి బావికదా అని ఉప్పు నీళ్ళుత్రాగటం లేదుకదా,ఇది అంతే.

పూర్వం ఎప్పుడో దేశ,కాల పరిస్తుతులను బట్టి రూపొందించిన వాస్తు సూత్రాలు ఈనాడు అన్నిటికి పనికి వస్తాయనటం సరికాదు.ఈ కాల దోషం పట్టిన వాస్తును వదిలి విశ్వవ్యాప్తం గా ఆమోదించిన నవీన సాంకేతిక విజ్ఞాన్నిసాదరంగా స్వాగతించండి.



Comments

తూచ్! మీరు ఇలాంటివన్నీ అడక్కూడదు. కులధూషణ తద్వారా మతధూషణ ఆపైన దేశ/జాతిద్రోహం మీపై ఆరోపించబడతాయి.
vasu said…
vastu is our cluture. vastu said 100% corectet. our cluture is made by such things. eavari abiprayalu varivi. we can rsepect others
ప్రశ్న లేకుండా ,పరిశీలన లేకుండా వంద శాతం వాస్తు వాస్తవం అని అనుకోవటం సరికాదు. ఎవరి అభిప్రాయాలు వారివే కావచ్చు,కాని వాస్తవాన్నిఅంగీ కరించవలిసినదే.
మహేష్ కుమార్ గారు,
కత్తి జారవిడకండి !
సత్యం ఎప్పుడు సమాజానికి గౌరవం ఇవ్వదు.
సమాజమే సత్యాన్ని గౌరవించాలి.
అలా జరగని సమాజం త్వరలోనే క్షినిస్తుంది.నాశనం ఔతుంది.
సత్యాన్ని ఒప్పించేలా సమాజాన్ని మార్చాలి.
వెనకడుగు వద్దు.
సత్యమేవ జయతే !!!

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది