Skip to main content

Posts

Showing posts from November, 2019

అమరావతి - ఆవశ్యకత - 6

సమస్యలు చుట్టుముట్టినపుడు , అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది. మంచి ఎదో చెడు ఎదో తెలియజేయవలిసిన బాధ్యత ఉంటుంది. సమస్యను పరిష్కారం చేయలేనప్పుదు దాన్ని గజిబిజి చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టే పరిపాలకులకు దశా దిశా నిర్దేశం చూపించాలి. తెలుగు వారి క్షేమం,అభివృద్ధి కోరేవారు అమరావతి రాజధానిపై స్పందించాలి. 1. మంచికో చెడుకో అమరావతిలో నూతన రాజధాని ఉండాలని స్థూలంగా అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. ప్రణాళికలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాప్రదేశం ఎంపికలో ఏకాభిప్రాయం ఉంది. దేశ నలుమూలల నుండి పవిత్ర జలాలు, పుట్ట మన్ను తెచ్చి ప్రదేశాన్ని శుద్ధి పరిచి, పెద్దలందరి సమక్షంలో ప్రధాని స్వహస్తాలతో అమరావతికి శంఖు స్థాపన చేశారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు, ప్రజా ఆమోదంతో మొదలు పెట్టిన పనికి అందరు నిబద్దతతో కట్టుబడి ఉండాలి. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు అని ఆనాడు అంగీకరించి మౌనంగా ఉన్న వ్యక్తులు ఈనాడు ఆక్షేపించటం సరికాదు. 2. రైతుల నుండి సమీకరించబడ్డ భూమిని తిరిగి యధాస్థితికి తెచ్చి వారికి ఇవ్వటం ఇప్పుడు అసాధ్యం. రైతులకు వచ్చిన స్థలాలు కొన్ని అమ్మకాలు కూడా జరిగాయి.

అమరావతి - ఆవశ్యకత - 5

ఆవేశం ఆలోచనను అణిచివేస్తుంది. అభిమాన దురాభిమానాలు వివేకాన్ని, విచక్షణను పోగొడతాయి. కక్షలు,కార్పణ్యాలు జాతిని దహించివేస్తాయి. ఈర్షా ద్వేషాలు, పగ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారతాయి. అనుమానాలు, అపనమ్మకాలు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తాయి. వ్యక్తిగతంగానే కాక సామాజకపరంగాకూడా వీటిని దరిచేయకుండా విజ్ఞతను చూపాలి. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పురుడు పోసుకుంటున్న క్రమంలోవస్తున్న సంకుచిత వాదనలలో ఇటువంటి పోకడలే కనిపిస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం.  1. కర్నూలు లో హైకోర్టు  ఒకనాడు తెలుగుజాతి అంతా ఐక్యంగా ఉండాలని,దానికొరకు రాజధానిని రెండుసార్లు త్యాగం చేసిన కోస్తా ఆంధ్రులు నేడు రాజధాని తమ ప్రాంతంలో ఉండాలనుకోవటం న్యాయబద్ధమైన కోరిక. రాజధానిలోనే హైకోర్టు ఉండాలనే భావనతో 1956లో గుంటూరులో ఉన్న హైకోర్టు హైదారాబాద్ పోయింది. ఆనాడు రాజధాని ఒకచోట, హైకోర్టు మరొక చోట ఉండాలన్న వాదన సరికాదని, రాజధానిలో హైకోర్టు అంతర్భాగమని శ్రీభాగ్ ఒప్పందం చేసుకొన్నా అదే పెద్ద మనుషులు భావించటం, గుంటూరులో ఉన్న హైకోర్టు తిన్నగా హైదరాబాదు చేరటం చారిత్రిక వాస్తవం. ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన శ్రీభాగ్ ఒప్పందాన్ని ఇ

అమరావతి - ఆవశ్యకత - 4

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే శుభతరుణంలో కొంతమంది సంకుచిత వాదనలతో కుల, ప్రాంత భేదాలను రేపుతూ ప్రమాదకర రాజకీయ క్రీడను మొదలుపెట్టటం గర్హనీయం. పసలేని పనిమాలిన ఆ వాదనలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం.  1. రాజధాని విస్తీర్ణం ఎక్కువా?  రాజధానికి అంత భూమి ఎందుకు? కేవలం 13 జిల్లాల నవ్యంధ్రకు 35 వేల ఎకరాల తో పెద్ద రాజధాని కావాలా?  ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప రాజధానికి ఇంకేం ఉంటాయి ?  దానికొరకు ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా? ఇత్యాది కుటిల ప్రశ్నలతో అమరావతిని కుంగదీస్తున్న వారు వాస్తవాలు గ్రహించాలి.  అమరావతి కేవలం అవశేష 13 జిల్లాలకు మాత్రమే రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల హృదయస్పందన అనే స్పృహ ఉండాలి. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి, వైభవానికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.   ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు, తెలుగు భాషకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పురుడుపోసుకుంటున్న ఈ నగరం రాబోయే రోజులలో కావలిసిన అవసరాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుగా సమీకరించ బడినది. లబ్దిదారులైన రైతులకు, ప్రజ