Skip to main content

Posts

Showing posts from April, 2015

రాజధాని - నామకరణం

పేరులో ఏముంది? అనేవారు కొందరైతే పేరులోనే ఉన్నది పెన్నిది అనేవారు మరికొందరు. ప్రపంచం ఆశ్చర్యపడేలా ఆంధ్రులకు అద్భుత రాజధాని కావాలని కాంక్షించే వారికి దానికి తగిన పేరు కుడా ఉన్నతంగా ఉండాలని ఉబలాటపడటం సహజమే.  మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టటం అన్ని విదాల ఆమోదయోగ్యమైన నిర్ణయం.  అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవ