Skip to main content

Posts

Showing posts from July, 2009

వాస్తు దోషాలు !!!

ఈ దేశానికే వాస్తు సరిగా లేదని, అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు. మరొకడు రాష్ట్రానికి, ఇంకొకడు జిల్లాలకు, వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే, ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు. ఇలా గృహ వాస్తు రోజురోజుకి ముదిరి అనేక రంగాలలోకి దూరిపోతున్నది. దేశానికి అంటుకున్న ఈ వాస్తు తెగులుకు మందు వేయాలి, లేకుంటే జాతి నష్టపోయే ప్రమాదం ఉంది.  ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తీర్మానించి వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందు కుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.   నిరాశ, నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివేకం సన్నగి

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక