Skip to main content

Posts

Showing posts from June, 2009

వాస్తువు శాస్త్రమా?

వాస్తువు శాస్త్రమా, కాదా అనే విషయం లోఈనాడు విభిన్న వాదనలున్నాయి. నిజానికి వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాలనిర్మాణాలలో విధి విధానాలను శాసించే మన ప్రాచీన నివాస నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు . నేడు శాస్త్రం అనే పదాన్ని సైన్సుకు పర్యాపదంగా వాడుతున్నారు. వాస్తువు శాస్త్రమా? అనే విషయంలో వాస్తు శాస్త్రం నేటి సైన్సు పరిధిలో ఎంత విలువ ఉంది ? సైన్సుకు వున్నా లక్షణాలు దీనికి వున్నాయా ? అనే విషయంలోనే వాదోపవాదాలు పరిశీలించాలి. అలాగే చర్చలో కేవలం ఫలిత వాస్తును మాత్రమే పరిగణలోకి తీసుకోరాదు.  నిజానికి వాస్తులో చెప్పబడిన ఫలితాలు శాస్త్రాన్ని తు చ తప్పకుండా ఆచరించటానికి,ఫలితాల పేరుతో ప్రజలను భయపెట్టి శాస్త్రాన్ని అమలు జేయటానికి చేప్పబడినవే. గుడ్డిగా ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వాస్తు ముమ్మాటికి శాస్త్రం కాదు.  మనఫై వాస్తు ప్రభావం చూపుతుంది అనే వాదనలో వాస్తవం ఇసుమంతైనా లేదు . అదిగో పులి అంటే ... ఇదిగో తోక అనేవారు , దున్న ఈనింది అంటే ... దూడను కట్టేయమనేవారు ఎప్పుడు వుంటూనే వుంటారు. వీరిమాటలు విని

వాస్తు ఫై మీ సందేహాలకు నా సలహాలు

వాస్తు ఫై మీ సందేహాలకు నా సలహాలు  ఆంధ్ర జ్యోతి దినపత్రికలో 'తూర్పు- పడమర' అనే శీర్షిక పేరుతో ఏప్రిల్ 2006- 2007ఏప్రిల్ వరకు ప్రతి ఆదివారం ప్రచురించ బడిన నా వాస్తు వ్యాసాలు మరియువాస్తు ఫై సందేహాలకు నేను సలహాలు చెప్పటం మీకు గురుతున్నదనుకుంటున్నాను. అనేక మంది ఇంకా వాస్తు ఫై అనేక సందేహాలను వ్యక్తపరుస్తున్నరు .  వీరికి నాబ్లాగ్ లో http://vaasthuvidya.blogspot.com సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను. సందేహాలను తీర్చుకోండి.