Skip to main content

Posts

Showing posts from December, 2019

అమరావతి - ఆవశ్యకత - 8

మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు. 1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాల

అమరావతి - ఆవశ్యకత -7

రాయల సీమ రాజకీయం నిజం చెప్పులు తొడుగుకొని బయటికి వచ్చేసరికే అబద్దం ఆరు సార్లు ఊరంతా తిరిగి వస్తుందనేది జగమెరిగిన నానుడి. అమరావతి పై అసూయతో రాజకీయ లబ్దికొరకు కొందరు అదేపనిగా అనేక అబాండాలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు.   కావలి కాసే కుక్కను చంపాలనుకొనే వారు దానికి పిచ్చి అని చెప్పి తలొక రాయి వేసినట్లు అమరావతిని భ్రమరావతిగా ప్రచారం చేశారు. ఇక్కడ కుల పిచ్చి ఉందని నిజానిజాలు నిర్దారణ జరగకుండానే తీర్పులు చెప్పటం విచారకరం.  ఇలా కొంతమంది రాయలసీమ పెత్తందారులు కోస్తా ఆంధ్రపై ముఖ్యంగా ఈ అమరావతి కృష్ణ తీరప్రాంతంపై విషం చిమ్మటం గత 90 సంవత్సరాలనుండి గమనిస్తున్నదే. 1926 లో విజయవాడలో నెలకొల్పిన ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని తమ ప్రాంతంలో పెట్టలేదనే అక్కసుతో విశాఖపట్నం తరలించటం లో సీమకు చెందిన మేధావి సి.ఆర్ రెడ్డి పాత్ర అనితరసాధ్యం. ఆంధ్రతో కలిసి ఉండటానికి శ్రీ బాగ్ ఒప్పందం పేరుతో పదవుల కొరకు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వారి మద్య ఒక చట్టబద్దత లేని ఒప్పందం కుదుర్చికొని విజయవాడలో ఉండాలిసిన రాజధానిని కర్నూలుకు తీసుకుపోయారు. మరల వారి స్వలాభం చూసుకొని హైదరాబాదుతో ఒప్పందం చేసుకొని రాజధానిని మారుస్తూ, హైకోర్టు