Skip to main content

Posts

Showing posts from March, 2020

అలుపెరుగని అమరావతి పోరాటం

ఆంధ్రుల ఆశాజ్యోతిగా ఆత్మగౌరవ చిహ్నంగా ప్రజా రాజధాని అమరావతిలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మొదలైన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకం. భూమి పుత్రులు మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఆంధ్ర జాతిని మేల్కొలిపింది. ఈ అమరావతి ఉద్యమం కుల మత ప్రాంతాలకుఅతీతంగా ఊరు వాడలను ఏకంచేసింది. ఆంధ్రుల ఆవేశం ఆరంభ శూరత్వం మాత్రమే అనే పాత నానుడికి అమరావతి లో జరుగుతున్న ఈ మహాఉద్యమం పాతర వేసింది. అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు ఎదురొడ్డి అడ్డుకట్ట వేసింది. బెజవాడ కనకదుర్గ ఆనతో నడుము కట్టిన నారీలోకం ఆత్మగౌరవ పోరాటంలో శంఖారావం పూరించి అగ్రభాగాన నిలిచి పొరాడు తున్నది. రాజ్యహింస చేసిన గాయాలతో మానసిక వేదనతో అసువులు బాసిన అరవై మంది అమరుల ఆత్మసాక్షిగా అహింసా మార్గంలో గాంధేయ స్ఫూర్తిగా బడుగు,బలహీన వర్గాల రైతులు కూలీలు,విద్యార్థులు, మేధావులతో సాగుతున్న ఈ ఉద్యమం విజయం సాధించి చరిత్ర పుటలలో నిలిచి పోతుంది. భావి పోరాటాలకు స్ఫూర్తిగా ఉంటుంది.  మోసం అనేది చాలీచాలని దుప్పటిలాంటిది. తల కప్పుకుంటే కాళ్లు, కాళ్లు కప్పుకుంటే తల కనిపిస్తుంది. అభివృద్ధికి అధికార వికేద్రీకరణ అంటూ చాలీచాలని దుప్పట్లో దూరిన పాలక నేతలు మూడు రాజధానులు పేరుతో పలుకుతున్