Skip to main content

అలుపెరుగని అమరావతి పోరాటం

ఆంధ్రుల ఆశాజ్యోతిగా ఆత్మగౌరవ చిహ్నంగా ప్రజా రాజధాని అమరావతిలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మొదలైన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకం. భూమి పుత్రులు మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఆంధ్ర జాతిని మేల్కొలిపింది.

ఈ అమరావతి ఉద్యమం కుల మత ప్రాంతాలకుఅతీతంగా ఊరు వాడలను ఏకంచేసింది. ఆంధ్రుల ఆవేశం ఆరంభ శూరత్వం మాత్రమే అనే పాత నానుడికి అమరావతి లో జరుగుతున్న ఈ మహాఉద్యమం పాతర వేసింది. అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు ఎదురొడ్డి అడ్డుకట్ట వేసింది. బెజవాడ కనకదుర్గ ఆనతో నడుము కట్టిన నారీలోకం ఆత్మగౌరవ పోరాటంలో శంఖారావం పూరించి అగ్రభాగాన నిలిచి పొరాడు తున్నది. రాజ్యహింస చేసిన గాయాలతో మానసిక వేదనతో అసువులు బాసిన అరవై మంది అమరుల ఆత్మసాక్షిగా అహింసా మార్గంలో గాంధేయ స్ఫూర్తిగా బడుగు,బలహీన వర్గాల రైతులు కూలీలు,విద్యార్థులు, మేధావులతో సాగుతున్న ఈ ఉద్యమం విజయం సాధించి చరిత్ర పుటలలో నిలిచి పోతుంది. భావి పోరాటాలకు స్ఫూర్తిగా ఉంటుంది. 
మోసం అనేది చాలీచాలని దుప్పటిలాంటిది. తల కప్పుకుంటే కాళ్లు, కాళ్లు కప్పుకుంటే తల కనిపిస్తుంది. అభివృద్ధికి అధికార వికేద్రీకరణ అంటూ చాలీచాలని దుప్పట్లో దూరిన పాలక నేతలు మూడు రాజధానులు పేరుతో పలుకుతున్న అబద్దాలు, అర్ద సత్యాలు,ఆడుతున్న రాజకీయనాటకాలు పాలకుల నైజాలను, నగ్నత్వాన్ని నలుచెరుగులా బహిర్గతం అయింది. బాధ్యత లేని లేకి చేష్టలతో,వెకిలి మాటలతో ఉద్యమ ఊపిరి తీద్దామన్న వెర్రి వెదవలకు వాస్తవం బోదించింది. భూమికి కులం అంటగట్టిన గజ్జి గాళ్ళకు మాది రైతుకులం అని మాడు పగలగొట్టింది. చట్టాలను చుట్టాలచేతుల్లో పెట్టి చంకలు గుద్దుకున్న చవటలకు ధర్మాసనం చెవులు పిండి బుద్దిచెప్పింది. అంతరజాతీయా ప్రమాణాలతో అద్భుతంగా అజారామంగా ఉండవలిసిన అమరావతిని మురికివాడగా మార్చాలనుకున్న అంట్లవెధవల మురికి ఆలోచనలకు ముక్కుతాడు వేసింది. కండ బలం,కాసుల బలం కంటే జనబలం మిన్న అని ఉద్యమాల చరిత్ర చూస్తే తెలుస్తుంది. 
ఇసుక నుండి నూనె తీయవచ్చు, కుందేలు కొమ్ము తేవచ్చు గాని మూర్గుని మనసు మెప్పించలేమని పెద్దల మాట. కానీ ఇది రాజరిక వ్యవస్థ కాదు, నియంతలకు,జనాంతకులకు చోటు లేదు. ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు వారి మాటే శిరోధార్యం అన్న ఇంగిత జ్ఞానం పాలకులకు బోధపడే వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతుంది. ఆంధ్రజాతి భవిషత్ కొరకు జరిగే ఈ ఉద్యమం అన్ని ఆటుపోట్లను ఎదిరించి విజయం సాధిస్తుంది. ఇది అక్షర సత్యం. 
జై అమరావతి ... జై ఆంధ్ర ప్రదేశ్ 
ఆచార్య కొడాలి శ్రీనివాస్. 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .