Skip to main content

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య
VAASTHU VIDYA
(బృహత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007
జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు  వరాహమిహిరుని చే  ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మకతాత్పర్యం  ఇవ్వబడినది.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది . 
పేజీలు : 100
VAASTHULO EMUNDI?
2. వాస్తు లో ఏముంది?
వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997
లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. 
చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వాస్తును అనేకమంది అవగాహనారహిత్యంతో అతిగా ఆచరిస్తున్నారు .
ఈశాన్నం లో నుయ్యి ,ఆగ్నేయంలో పొయ్యి ...వాస్తు అంటే ఇదే అనే భ్రమను తొలగించి వాస్తవాన్ని మీముందు ఉంచుతుంది .సాంకేతిక దృష్టితో పరిశీలన జరుపుటవలన శాస్త్రి యమైన వాస్తుఫై స్పష్టమైన అవగాహనను కలుగజేస్తుంది. వాస్తుఫై నమ్మకం ఉన్నా లేకున్నా ప్రతివారు చదువవలసిన గ్రంథం. నిజంగా వాస్తులో ఏముందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ గ్రంధం ఉపకరిస్తుంది . 
పేజీలు : 240
3. వాస్తు లో వాస్తవాలు
VAASTHULO VAASTHAVAALU 
A study on vaasthusasthra - 2001 
మెరిసేదంతా బంగారం ఎలాకాదో అలాగే ఈనాడు వాస్తు పేరుతొ చెప్పేవన్ని వాస్తవాలు కావు .నేడు వాస్తు పేరుతొ అనేక విషయాలు వాస్తవాలుగా వర్దిల్లుతున్నాయి.నిజంగా వాస్తులో వాస్తవాలు తెలుసుకోవాలనేవారికి ఈ పుస్తకం మార్గదర్శకంగా ఉపకరిస్తుంది. ప్రాచిన - అర్వాచీన వాస్తు గ్రంధాలను క్షుణ్ణంగా పరిశోధించి ,వాస్తులోని వాస్తవాలాను వెలికితీసిన పరిశీలనా గ్రంధం ఇది.
వాస్తు శాస్త్రాన్ని సాధికారికంగా పరిశీలించి, దానిలోని దోషాలను దాపరికం లేకుండా వివరించినందువల్ల , వాస్తుఫై ఒక అవగాహన కలుగజేస్తుంది .అనవసరపు ఆందోళనతో వాస్తు మరమ్మతులు చేసే ముందు తప్పనిసరిగా చదువవలిసిన గ్రంధం ఇది.
పేజీలు : 58
4. తూర్పు - పడమర
TURPU - PADAMARA
వాస్తు కు నిజమైన నిర్వచనం చెప్పి, చారిత్రిక ఆధారాలతో పాటు శాస్త్రీయ ప్రమాణాలను చూపెట్టిన వ్యాసాల సంకలనం.వీటిలో ఎక్కువ భాగం  ఆంధ్ర జ్యోతి దినపత్రిక లో ఏప్రిల్ 2006- 2007ఏప్రిల్ వరకు ఆదివారం అనుభంద పుస్తకం లో ప్రచురించ బడినవి. పాతిక పైగా వ్యాసాల తో పాటు ఆంద్రజ్యోతి  పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సహేతుకమైన  సమాధానాలు .
త్వరలో పుస్తకరూపంలో వస్తుంది.
వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి. 

Comments

kiran said…
where to but books..,e interested in learning vasthu..plz help me out
Nrahamthulla said…
నైరుతి కార్నర్ ప్లాటు మంచిది కాదు అని కొందరు భయపెడుతున్నారు.తిరుపతి వెంకటెశ్వర స్వామి,బెజవాడ కనకదుర్గ దేవాలయాలకు దక్షిణాన పల్లంలో రోడ్డుంది కాబట్టే చాలా లాభదాయకంగా ఉన్నారని,నైరుతి కార్నర్ ప్లాటు చాలా శుభకరం,జయకరం అని కొమరోలు సిద్ధాంతి (ఫోన్:9848089801) నిరూపించటానికి సిద్ధంగా ఉన్నారు.నైరుతి కార్నర్ లో ఇళ్ళు కట్టుకుని విజయం పొందిన వారి వివరాలు ఇంకా ఇస్తానంటున్నారు.
@Narhamthulla :
రకరకాల సవాళ్లు,ప్రతి సవాళ్ళ తో, రుజువుల తో బుర్ది కొట్టించే వాస్తు కుక్షిమబరులు తారస పడుతుంటారు.వీటిలో నిజం లేదు. ఇలాంటి వారి వలలో చిక్కి అనవసర మానసిక, ఆర్దిక కష్టాలు తెచ్చుకోకండి.
@కిరణ్:
నా రచనలు విశాలాంద్ర,ప్రజాశక్తి ల లో దొరుకుతాయి. లేకపోతే నాకు ఈమెయిలు చేయండి. vpbp లో పంపుతాను.
అందరికి ధన్య వాదాలు
Unknown said…
ఇంటిమీద రాగి చెట్టు నీడ పడితే నష్టమా లాభమా

Popular posts from this blog

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధ...