Skip to main content

Posts

Showing posts from December, 2020

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 5

EI - విజయవాడ - రచయత ఆచార్య కొడాలి శ్రీనివాస్ వాస్తు పేరుతో సమాజంలో మౌఢ్యం రాజ్యమేలుతుందని, వాస్తు ఫలితాల చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వాస్తు ఫలితాలలో నిజం ఏమాత్రం లేదని, రావిపూడివారు 'వాస్తువు శాస్త్రమా? ' లో అడుగడునా పలుమార్లు నొక్కిచెప్పారు. ఇలా ఇంతకుముందే వాస్తు ఫలాలు అబద్దాలని చెప్పిన ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, హేతువాదులు, నాస్తికులు అనేక మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు వాస్తు శాస్త్రం అనేది ఒకనాటి భారతీయ నిర్మాణ శాస్త్రం అనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఏమాత్రం సంకోచించలేదు. కేవలం రావిపూడి వెంకటాద్రి వంటి ఒకరిద్దరు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించటానికి సంసిద్దంగాలేరు.  ఏ విషయమైనా విమర్శకు గురి అయితేనే దానిలో లోటుపాట్లు బహిర్గతం అవుతాయి. క్రీ.పూ.4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే 16వ శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉండేవి. వీరి రచనలను విమర్శించటం ఆనాడు మతద్రోహంగా భావించేవారు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువుగల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుక

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 4

అర్థాలు - అపార్దాలు   వాస్తు శాస్త్ర మూల గ్రంథాలన్నీ సంస్కృతం లోనే ఉన్నాయి. నేడది మృత భాష. సంస్కృత భాష విలక్షణమైనది. భాష విస్తృతం కానప్పుడు ఓకే పదం అనేక అర్ధాలతో ప్రయోగించటం సర్వ సాధారణం. సాహిత్య ప్రయోగంలో వాడకలో ఉన్న ఒక పదాన్ని విభిన్న అర్థాలతో వాడటం కవుల కల్పనా  శైలికి తార్కాణంగా పేర్కొంటారు. విషయాన్ని బట్టి పదం యొక్క అర్థాన్ని స్వీకరించితే  అర్ధవంతమైన భావం సిద్ధిస్తుంది. గణిత, ఖగోళ, వైద్య, వాస్తు  ఇత్యాది శాస్త్ర గ్రంధాలలో వాడిన పదాలకు తత్సంబంధమైన శాస్త్ర పరి భాష అర్థాలలో  హేతుబద్దమైనవి మాత్రమే అన్వహించుకోవాలి. వాడుక అర్థాలు స్వీకరించ రాదు.  వాస్తు శాస్త్రం అనేది మన సమాజంలో ఆదినుండి, ఆధునిక నిర్మాణాలు వచ్చే వరకు తనవంతు తోడ్పాటు అందించిదన్నది వాస్తవం. ఈ కోణంలోనే నిర్మాణ విషయంలో ఉపయోగించిన పదాలకు సాంకేతిక అర్థాలు స్వీకరిస్తే వాస్తుపై మరింత స్పష్టత వస్తుందని చెప్పుతూ నేను రాసిన పుస్తకమే  'వాస్తులో వాస్తవాలు'. ఈ   పుస్తకంలో ప్రస్తావించబడిన సాంకేతిక పదాల అర్థాలు రావిపూడి వెంకటాద్రి గారికి  కృత్తక అర్దాలుగా, విపరీతార్థలగా కనిపించాయట. వాస్తులో ఉన్న శ్లోకాలు తెలుగు బాగా వచ్చిన వారిక