Skip to main content

Posts

Showing posts from May, 2015

చైనా వాస్తు -ఫెంగ్ షుయి

నీవు నైరాశ్యం లో జీవిస్తున్నావు అంటే భూతకాలంలో, ఆందోళనలో గడుపుతూ ఉంటే భవిషత్ కాలంలో, ప్రశాంతంగా జీవిస్తున్నావు అంటే వర్తమానంలో బ్రతుకుతున్నావని తెలుసుకొ ... అని చైనా తత్వవేత్త తావో ఉపదేశం.   ఈ తత్వం తలకెక్కక తల్లడిల్లే వారెందరో. కష్టనష్టాల ఊబిలో ఊపిరి సలపనివారు, ఆశా భయాల ఊయలలో ఉగిసలాడేవారు వివేకం కోల్పోయి దప్పికతో ఉన్న దుప్పుల్లా ఎండమావుల వెంట పరుగులు పెడుతుంటారు.  సర్వ సంపదలకు, కర్మ ఫలాలకు మన దేశవాళి వాస్తు దారి చూపిస్తుందనే వాస్తు విధ్వంసుల విన్యాసాలతో జరిగిన గృహాల విధ్వంసంతో కుదేలైన జనం తాజాగా చైనా బాటపట్టారు.  కొత్త ఒక వింత - పాత ఒక రోత అన్నట్లు మన పాత వాస్తును వదిలి చైనా వారి సాంప్రదాయక వాస్తు మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు. చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ అనికూడా పిలుస్తారు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రాలు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.   తైజీతు యంగ్-యాన్ చిహ్నం  మనిషి మనుగడకు గాలి, నీరుకు ఉన్న ప్రాముఖ

గృహ విలాపం

గృహ విలాపం - Gruha Vilapam పండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు, అతిధి మర్యాదలకు రంగు రంగుల వలువలతో  మేళ తాళాల సాక్షిగా తోడున్నా నీనెచ్చెలిగా ! రోగాల, రొస్తుల చావు బ్రతుకుల పోరాటంలో బాసటగా నీ  కష్టాల కన్నీళ్లను  నిశ్యబ్దంగా దిగమింగా  ఓ  ప్రాణ నేస్తంగా !   కంటికి రెప్పలా, కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా  శైశవం నుండి కొన ఊపిరి దాక నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా ! చెప్పుడు మాటలు చెవికెక్కిన నీచేతిలో దగాపడి  నడివీధిలో నాగుబాటుకు లోనైనా ద్రౌపదిలా  నీ అసమర్ధ జీవనయానంలో కాలికి తగిలే ప్రతి రాయికి  జన్మనిచ్చిన రాకాసి తల్లిగా ! ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ... నేరం నీదైతే ...  వాస్తు  దోషి గా నాకెందుకు ఈ మరణ శిక్ష ?