Skip to main content

Posts

Showing posts from January, 2015

నాయకులకు వాస్తు భయాలు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తు వశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి. దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది.  ఈనాడు సౌజన్యంతో   తెలంగాణ ముఖ్య మంత్రి KCR కు వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తు పిచ్చి ఉంటె వారి సొంత ఇంటికి అదీ చాలకపోతే తెరాస పార్టీ భవనంకు సరి చేసుకోవాలి.పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వక్ర దృష్టి సచివాలయం పై పడింది.  ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట. చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట.  అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వాస్తు భవనం కడతాడట.  ఇన్నాళ్ళు బాగున్న సచివాలయం వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదో వివరించాలి. గలీజు చరిత్ర వాస్తుతో పోతుందా? ఒక వేళ సచివాలయం వాస్తు కుద

రాజధాని - నగర వాస్తు -2

రాజధాని - నగర వాస్తు -1 లో    నవ్యాంద్ర రాజధాని నగర నిర్మాణం లో స్థల ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాలు దీనిలో పరిశీలించుదాం.   ఆంధ్రులకి చాల పురాతన ఘనచరిత్ర ఉంది. ధాన్యకటకం (అమరావతి) నుండి హంపీ విజనగరం వరకు ఎన్నోసార్లు రాజధానులు నిర్మించుకున్న నైపుణ్యం, శక్తి, యుక్తి కలిగిన జాతి. ఆనాటి మన రాజధానులు వాస్తు శాస్త్రం లో ఉన్న సూత్రాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి అనుటలో సందేహం లేదు.   వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు.  రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి.  అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి) వృత్తాకారంలో కాని చతురస్రాకారం

రాజధాని - నగర వాస్తు -1

రాజ్యానికి రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది . రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి.  రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.  1. నగర వాస్తు "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం. వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'ద