Skip to main content

Posts

Showing posts from October, 2019

అమరావతి - ఆవశ్యకత - 3

చేఎత్తి జే కొట్టు తెలుగోడా , గతమెంతో ఘనకీర్తి గలవోడా .. అనే ప్రబోధ గీతం తో ఒకనాడు నిద్రాణస్థితి నుండి మేల్కొన్న జాతి , ఆత్మ గౌరవనినాదంతో కదం తొక్కిన తెలుగు జాతి విభజనతో దగాపడితే ఆత్మవిశ్వాసం కలిగించి అభిమానంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకొన్ననేలఅమరావతి. ఇది బుద్దిమాధవ్యం గలవారికి భ్రమరావతిగా కనిపించవచ్చు.అలాంటి వారి భ్రమలు తొలగి సౌమ్య అమరావతిగా నూతన తేజస్సుతో నవ్యఆంధ్ర రాజధానిగా అవతరిస్తుంది. ఆంద్ర జాతి ఉన్నంతవరకు అమరావతి శాశ్వితంగా ఉండటానికి ఉపకరిస్తున్న అనేక సాంఘిక, ఆర్థిక కారణాలతో పాటు రాజకీయ, నైసర్గిక, నైతిక విషయాలు ప్రస్తావించుకుందాం. 1. రవాణా సదుపాయాలు a) విజయవాడ లో 1888 లో ప్రాంభించబడి దాదాపు 132 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న అతి పేద్ద రైల్వే కూడలి ఉంది. 22 ట్రాక్స్ తో ,10 ఫ్లాట్ ఫార్మ్స్ నుండి ప్రతి రోజు 1.5 లక్షల ప్రయాణికులకు సేవచేస్తూ దేశంలోనే 4వ అతి పెద్ద స్టేషన్ గా విలసిల్లుతుంది. b) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు సేవలందించి 2003లో పౌర విమానాశ్రయంగా మారి దినదినాభివృద్ధి చెందుతున్న గన్నవరం విమానాశ్రయం జోడవటం అమరావతికి కలిసివచ్చిన అంశం. c) జాతీయ రహదారులు NH - 16,( చెన్నై-కల

అమరావతి - ఆవశ్యకత -2

1.అమరావతి నగర ప్రణాళిక  అమరావతి రాజధానికి గా ఉండటానికి దానికి కున్న చారిత్రిక వైభవం మాత్రమే కాక ఇతర యోగ్యతలను పరిశీలిద్దాం. రాజధానికి అనువైన ప్రాంతం గురించి పలు అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో అందరు చర్చించే వాటిలో వాస్తు అనుకూలతలు ఒకటి. ఇక్కడ ఇంటికి సంభందించిన వాస్తు విషయాలను వదిలి రాజధానికి సంబంధించిన వాటినే ప్రస్తావిస్తాను. వాస్తు ప్రస్తావనలు    "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం.  వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ /నగర వాస్తు ' పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండలపై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని, అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే 'భూ దుర్గం' అని వర్గీకరించారు. వీటిలో శత్రు భయం లేని చోట భూ దుర్గాలు నిర్మించటం సర్వ శ్రేష్టం అని చెప్పబడింది. రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండ

అమరావతి - ఆవశ్యకత -1

1.అమరావతికి అంకురార్పణ ఏ రాజ్యానికైనా ఒక రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు ఒక రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది. రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకతో గత ప్రభుత్వం అందరి ఆమోదంతో అసంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి అమరావతికి అంకురార్పణ చేయటం అందరికి విదితమే. దానికి రైతులనుండి భూసమీకరణ పద్దతిలో 34 వేల ఎకరాల భూమిని సమకూర్చుకోవటం , ఇప్పటివరకు 8 వేల కోట్ల ప్రజా ధన్నాన్ని వెచ్చించి కొంతవరకు నిర్మాణాలను చేయటం జరిగింది. అయితే గత ఎన్నికలలో ప్రభుత్వం మారటంతో " రెడ్డి వచ్చే ... మొదలిడు" అన్న చందాన రాజధాని విషయం మళ్ళీ మొదలకు వచ్చింది. ఇలాంటి సంకట స్థితిలో ప్రజలు విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి. అమరావతి నిర్మించాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలుసుకోవాలి. రాజధాని రూపురేఖలు గురించి మాట్లా