Skip to main content

అమరావతి - ఆవశ్యకత -2


1.అమరావతి నగర ప్రణాళిక 

అమరావతి రాజధానికి గా ఉండటానికి దానికి కున్న చారిత్రిక వైభవం మాత్రమే కాక ఇతర యోగ్యతలను పరిశీలిద్దాం. రాజధానికి అనువైన ప్రాంతం గురించి పలు అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో అందరు చర్చించే వాటిలో వాస్తు అనుకూలతలు ఒకటి. ఇక్కడ ఇంటికి సంభందించిన వాస్తు విషయాలను వదిలి రాజధానికి సంబంధించిన వాటినే ప్రస్తావిస్తాను.

వాస్తు ప్రస్తావనలు  

 "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం. 

వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ /నగర వాస్తు ' పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండలపై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని, అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే 'భూ దుర్గం' అని వర్గీకరించారు. వీటిలో శత్రు భయం లేని చోట భూ దుర్గాలు నిర్మించటం సర్వ శ్రేష్టం అని చెప్పబడింది.

రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండి రాకపోకలకు అనువుగా ఉండేలా రాజధానిని నిర్మించాలని, అది నివాస యోగ్యంగా ఉండాలని చెప్పారు. మహా భారతం లో శ్రీకృష్ణుడు పాండవుల కొరకు ఖాండవ వనాన్ని నిర్దాక్షణ్యంగా నిప్పు పెట్టి ఇంద్రప్రస్థం పేరుతో వన దుర్గాన్ని, తన కొరకు సముద్రంలో ద్వారక పేరుతో జల దుర్గాన్ని నిర్మించాడని చెప్పబడినది. అలాగే చరిత్ర పుటలు తిరగేస్తే బోలెడన్ని కొండలపై కట్టిన గిరి దుర్గాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో అమారావతి ప్రాంతంలో రాజధానులుగా వెలసిల్లిన కొండపల్లి కోట,కొండవీడు కోట ప్రసిధ్ధి చెందాయి.

చరిత్రలో నదీ తీరంలో వెలిసిన రాజధానులు ఎన్నో దర్శనం ఇస్తాయి. అలాగే నదికి ఉత్తర తీర దిశలో నిర్మించే నగరాన్ని 'సౌమ్యపురం' అని, దక్షిణ తీరం లో కట్టే వాటిని 'ధర్మ పురం' అని చెపుతూ నదికి ఇరు తీరాలలో నగరాలు నిర్మించ వచ్చునని చెప్పబడింది. నగరానికి ఉత్తర దిశలో మాత్రమే నీరు ఉండాలనే సిద్దాంతం కుడా తప్పే. భూ లభ్యతను బట్టి నగర నిర్మాణం నదికి ఎవడ్డునైనా నిర్మిచుకోవచ్చు. కృష్ణకు ఉత్తరాన నిర్మిస్తున్న మన అమరావతి సౌమ్య నగరం గా భాసిల్లుతోంది. 

వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు. రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి.
అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి ) వృత్తాకారంలో కాని చతురస్రాకారం లో కాని దీర్ఘ చతురస్రాకారం (ఆయతాకారం) లో కాని ఉండవచ్చు అని చాణుక్యుడు సాదారణ సూత్రీకరణ చేస్తే మత్స్య పురాణం లో నదీతీరంలో నిర్మించే రాజధాని అర్ధ చంద్రాకారంలో ఉండటం ప్రశస్తం అంటుంది. 

అలాగే అక్కడ ఉన్న భూమి దేవమాత్రుకం (వర్షాధార/మెట్ట భూమి ) కాకుండా నదీ మాత్రుకం (మాగాణి) గా ఉండాలి అని ,ఇంకా అది పలు పుష్ప, ఫలోఫేతమై కడు రమ్యంగా ఉండాలి. అచ్చట ఉన్న జనులు అనురక్తులుగా వారిలో అత్యధికులు వ్యవసాయం, వ్యాపారం చేసే కర్మకారులుగా (శ్రమజీవులు) ఉండాలి అని చెబుతుంది.
రాజాధాని నగరానికి కుడి వైపున జల ప్రవాహం ఉండాలి. అంటే తూర్పు దిశకు నగరం ఉంటె జలప్రవాహం దక్షణం లో ఉత్తరంగా ఉంటె తూర్పున, పడమర దిశ లో ఉంటె జలప్రవాహం ఉత్తరంలో, దక్షిణ దిశకు ఉంటె పడమర దిశలో ప్రవాహం ఉండాలి అని కౌటిల్లుని ఉవాచ.
ఇది తూర్పు,ఉత్తర దిశలలో మాత్రమే ప్రవాహం ఉండాలనే ఈనాటి కొత్త వాస్తు ప్రవక్తలకు మింగుడు పడని విషయం. అలాగే మురుగు నీరు పోయే మార్గం ఎడమ ప్రక్కన ఉండాలి.
పుర మధ్యలో దేవాలయాలు, విపణి వీధులు (వ్యాపార ప్రదేశాలు) తో పాటు వివిధ ప్రదేశాలలో వైద్యశాలలు, ధాన్యాగారాలు, ఉద్యానవనాలు, యంత్ర శాలలు (కర్మాగారాలు), అగ్ని శాలలు నిర్దేశించిన ప్రదేశాలలో ఉండాలి.
ఉత్తర లేక తూర్పు దిశలలో శ్మశాన ప్రదేశాలు ఏర్పాటు చేయాలి అని చెబుతూ శూద్రులకు, మిగతావారికి దక్షిణ దిశలో ఉండాలని శాసించాడు.
అయితే నివాసం గా ఏ ప్రదేశం శ్రేష్టం అనే విషయం గురించి 13 వ శతాబ్దికి చెందిన సుమతీ శతక కవి బద్దెన ఒక వాస్తవిక వాస్తు సూత్రం చెప్పాడు. అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు, ఎల్లప్పుడు ప్రవహించు నదియును, విద్యావంతులు గల ప్రాంతాలు నివస యోగ్యాలని చెప్పారు. ఈ లక్షణాలు నూతన రాజధానికి కుడా అవశ్యమే. 

2.సుందర రాజధాని

ఉన్నంతలో ఈ లక్షణాలు విజయవాడకు మాత్రమే పుష్కలంగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టగలిగే ఆర్దిక బలం గలవారు, నైపుణ్యం గల విద్యావంతులు, వైద్యులు , ఎల్లప్పుడూ పారే కృష్ణా నది తో నీటి వసతి తో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టే ఇది నివాస ప్రదేశంగా ఆనాటి నుండి నేటివరకు విరాజిల్లుతున్నది. 

అందమైన ఈ అమరావతి ప్రాంతం నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఇది నడిబొడ్డు.రాష్ట్రం నలుమూలల నుండి రాకపోకలకు అనువైన ప్రదేశం. నదికి ఇరు ప్రక్కల నదీ ముఖ రాజధానిగా ఇది దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. శత్రు భయం లేని సురక్షిత ప్రదేశం మన అమరావతి. ఇక్కడే భావి తరాలు భవిషత్ ను దృష్టి లోనుంచుకొని సొగసైన, సౌకర్యవంతమైన, సుసంపమైన పచ్చని పర్యావరణ హితమైన సుందర రాజధానిని తెలుగు జాతి గర్వపడేలా, పరులు మెచ్చేలా గొప్పగా నిర్మించుకుందాం. ఈ బృహత్తర మహా నగర నిర్మాణంలో మనం సైతం ఉడతాభక్తిగా సహాయ సకారాలు అందించుదాం. తెలుగు తల్లికి వడ్డాణంగా కనక దుర్గమ్మ కనుచూపులతో మన అమరావతి శోభిల్లుతుందనుటలో సందేహం పడవలదు. 
 (సశేషం) ఆచార్య కొడాలి శ్రీనివాస్

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర