Friday, April 15, 2016

NATIONAL SURVEY DAY – 2016

"జాతీయ సర్వే దినం -2016" సందర్బంగా విజయవాడ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ వారిచే 11-04-2016 న అమరావతి అమరిక,నిర్మాణంలో సర్వేయింగ్ పాత్ర  అనే అంశం పై  నేను ప్రధాన ప్రసంగం చేశాను. దాని వివరాలు.

       The Institution of Engineers (India)
             96 years of Relentless Journey Towards Engineering Advancement for Nation Building
                                      Vijayawada Local Center
 NATIONAL SURVEY DAY – 2016
Brief note on the Technical Talk on
ROLE OF SURVEYING IN PLANNING AND CONSTRUCTION OF AMARAVATHI

The Vijayawada Local Center of the Institution of Engineers (India) organized National Survey Day – 2016 at its premises on Monday, the 11th April, 2016 at 18.30 hrs.  Er. V Gopal, FIE invited the dignitaries on to the dais while Er. Butta Rajasekhar, MIE introduced the speaker to the audience.
Dr. M Kamaraju, FIE, Chairman of the center presided over the meeting. The speaker Prof. Kodali Srinivas, Professor of Civil Engineering Department, Kallam Harinatha Reddy Institute of Engineering & Technology, Guntur while delivering on the caption ROLE OF SURVEYING IN PLANNING AND CONSTRUCTION OF AMARAVATHI with Power Point Presentation said that the planning and design of all Civil Engineering projects such as construction of Towns, cites, highways, Water ways, bridges, tunnels, dams etc are based upon surveying measurements.

Moreover, during execution, project of any magnitude is constructed along the lines and points established by surveying. Thus, surveying is a basic requirement for all Civil Engineering projects. 
Here we have a life time opportunity to participate in planning and construction of  Amaravati, the People's capital of Andhra Pradesh. It is envisioned to be a city of world-class standards with a vision of increasing Andhra Pradesh’s prominence in the world. It will be developed as smart, Blue-Green and sustainable city.  The Capital has to provide cutting-edge infrastructure, comfortable livelihood and immense prosperity for the People of Amaravati.

To achieve all the objectives in planning and construction of Amaravati, the surveying along with our traditional vaasthu have significance role.
He advised A.P. State Govt. to follow a uniform Vaasthu principles throughout the planning and construction of Government offices as well as private buildings.  
The planning should not be altered in future by the so called vaasthu advisers for their will and wish.  
To make convenience to the people it is advisable to fix a permanent north point to the Amaravathi City. Alignment of roads and buildings are strictly based on this North Point. 
A memento was presented to the speaker by Prof. K Ravindra Rao, FIE.  Finally, vote of thanks was proposed by Er. GV Srinivasulu, MIE, Hon. Secretary of this local center.
·   Prof. Kodali Srinivas ,Professor of Civil Engineering Department, Kallam Haranatha Reddy Institute of Engineering and Technology, Chowdavaram, Guntur. 

Thursday, May 21, 2015

చైనా వాస్తు -ఫెంగ్ షుయి

నీవు నైరాశ్యం లో  జీవిస్తున్నావు అంటే  భూతకాలంలో ,ఆందోళన లో  గడుపుతూ ఉంటే  భవిషత్ కాలం లో , ప్రశాంతంగా జీవిస్తున్నావు అంటే వర్తమానం లో బ్రతుకుతున్నావని తెలుసుకొ ... అని చైనా తత్వవేత్త తావో పదేశం. 
ఈ తత్వం తలకేక్కక తల్లడిల్లే  వారికి,ఆశా భయాలతో ఉగిసలాడేవారు  దప్పిక తో ఉన్న దుప్పుల్లా ఎండమావుల వెంట పరుగులు పెడుతుంటారు.

మన దేశవాళి వాస్తు విధ్వంసుల విన్యాసాలతో జరిగిన గృహాల విధ్వంసంతో కుదేలైన జనం తాజాగా కొత్త ఒక వింత -పాత ఒక రోత  అన్నట్లు చైనా వారి సాంప్రదాయక వాస్తు మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు.
చైనా భాషలో ఫెంగ్ - షుయి - అంటే.. గాలి - నీరు అని అర్థం.
మనిషి మనుగడకు గాలి, నీరు కు ఉన్న ప్రాముఖ్యత ను గుర్తించి వాటిని ఇంటికి కుడా ఎలా వర్తింపజేయాలనే సూత్రాన్ని ఆధారం చేసుకొని రూపొందించినదే ఈ చైనా వారి వాస్తు. ఈనాడు ఇది రకరకాల పోకడలతో క్రొత్త పుంతలు త్రొక్కుతూ ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తూ ఒక గాలి ధుమారం వలె మన దేశంలోకి దిగుమతి అయింది.
వాస్తు దోషాలకు రకరకాల వాస్తు పూజలు, వాస్తు తాయెత్తులు (మత్స్య యంత్రాలు,కుబేర యంత్రాలు ), దిష్టి పిడతలు/ బొమ్మలు , గుమ్మడికాయలు, నిమ్మకాయలు, వెంట్రుకలు - మిరపకాయలు   వంటి మన ప్రాచీన దేశీవాళి  చిట్కా పద్దతుల స్థానే ఆకర్షనీయమైన  చైనా దేశపు చిట్కాలు, చిత్రాలు, చిందులు  ఫెంగ్ - షుయి పేరుతో మార్కెట్టులోకి వచ్చాయి.
నవ్వే బుద్దుడి బొమ్మ ఉంటే ... సిరులు ఇంటిలోకి నవ్వుతూ నడచి వస్తాయట!
మూడు కాళ్ళ కప్ప బొమ్మ గుమ్మం లోకాచుకు కూర్చుంటే లక్ష్మీ మేలు జరుగుతుందట , ఇంకా చైనా పాము ( డ్రాగెన్), తెల్ల పులి, నల్ల తాబేలు, రంగు రంగుల చేపలు ...  వంటి చిత్రవిచిత్ర బొమ్మలు, వస్తువులు ఇంటిలోఉత్తినే ఉంచుకుంటే/  అమర్చుకుంటే శుభమట. 
గాలి గంటలు (విండ్ చిమ్స్), వెదురు పుల్లలు, కుత్రిమ నీటి కొలనులు, రాగి నాణేలు,  రంగు దీపాలు, ఎర్ర రిబ్బన్లు  ...అబ్బో బోలెడన్నితమాషా వస్తువులు .  
ఇలా రకరకాల సమస్యలకు  ఎడాపెడా చైనా వారి వస్తువులతో ఇంటిని నింపుకుంటే గృహ  దోషాలు తొలగిపోయి  అంతా మంచే జరుగుతుందట!! 
వద్దంటే డబ్బుఆట !!! 
ఎంత ఆశ ?
ఫెంగ్ షుయి పేరుతో జరుగుతున్న ఈ అసత్య ప్రచారంతో ఈనాడు చీనా వారి వాస్తు వస్తువులు మార్కెట్టులో వేలంవెర్రిగా అమ్ముడు పోతున్నాయి. వందల  నుండి వేల రూపాయలలో ఖరీదు చేసే ఈ వస్తువులు జనాల జేబులు ఖాళీచేస్తున్నాయి.
ఇప్పటికే మన వాస్తు పండితుల పిచ్చి చేష్టలతో ఇల్లు వళ్ళు గుల్ల చేసుకొని , ఇంకా ఆశ చావక ఈ చీనా వాస్తును పట్టుకొని ఇంటికి సొగసులు అద్దుతూ, మరమ్మత్తులు చేస్తూ,ప్రాకులాడే వారిని చూసి నవ్వాలో ... జాలిపడాలో ... అర్ధం కాకుండా ఉంది.
ఫెంగ్ షుయి పేరుతొ జరిగే మోసాలు, దోపిడిలు గమనించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ దేశంలో దీనిపై నిషేధం విధించినదన్న విషయం  ఇక్కడ  ప్రస్తావనార్హం. చట్ట విరుద్దంగా ఎవరైనా ఫెంగ్ షుయి ని చూపి ప్రలోభపెట్టి ప్రజల నుండి డబ్బు గుంజితే వారికి చేరసాలే గతి. 
ఈ నిషేధం తో ఫెంగ్ షుయి సిద్దాంతులు జీవనోపాది కోల్పోయి  చైనా ను  వదిలి ఇతర దేశాలలో కాలం గడుపుతూ ఈ నమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుచున్నారు.
ఏ దేశం లోనైనా వాళ్ళ సమాజం లో ఏదో ఒక రూపం లో కొన్ని మూడ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన విజ్ఞానం వికసించే కొద్ది వాటిలో కొన్ని కనుమరుగు అవుతాయి . అనాదిగా మన సమాజంలో ఇప్పటకే అనేక మూఢ విశ్వాసాలు పాతుకుపోయి ఉన్నాయి. వాటితోనే మన సమాజం సతమతం అవుతుంటే ఇంకా క్రొత్తగా కొన్నిపిచ్చి నమ్మకాలు ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకోవటం అభిలషియం కాదు.
చైనా చిట్కాలకు  చింతకాయలు రాలవు. చిత్ర చిత్ర చిట్కాలు చేస్తే కష్టాలు, నష్టాలు తీరవన్నసంగతి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

Monday, May 11, 2015

గృహ విలాపం


గృహ విలాపం -
Gruha Vilapamపండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు, అతిధి మర్యాదలకు
రంగు రంగుల వలువలతో మేళ తాళాలాల తోడున్నా నీనెచ్చెలిగా !

రోగాల, రొస్తుల చావు బ్రతుకుల పోరాటంలో
బాసటగా...
కష్టాల కన్నీళ్లను నిశ్యబ్దంగా దిగమింగా  ఓ  ప్రాణ నేస్తంగా !
 

కంటికి రెప్పలా, కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా
శైశవం నుండి కొన ఊపిరి దాక నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా !

చెప్పుడు మాటలు చెవికెక్కిన నీచేతిలో దగాపడి  

ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ...
నీ అసమర్ధ జీవనయానంలో కాలికి తగిలే ప్రతి రాయికి
జన్మనిచ్చిన రాకాసి తల్లిగా !

నేరం నీదైతే ... వాస్తు దోషిగా నాకెందుకు మరణ శిక్ష ?