Skip to main content

Posts

Showing posts from November, 2020

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 3

వాస్తు పుట్టుక  వాస్తు శాస్త్రం ఎప్పుడు పుట్టిందో, అది ఎప్పుడు గ్రంథస్థం చేయబడిందో తెలుసుకోవటానికి కొంత చారిత్రిక పరిశోధన చేయాలి. అయితే రావిపూడి గారు వాస్తు గ్రంథాలన్నీ 10 శాతాబ్దం తరువాతే వచ్చాయనే తలంపుతో వాస్తు 'ఆర్య వాస్తువా?' అంటూ అహేతుక వాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  ఆర్యులు నివసించిన గంగానది దక్షిణ తీర మైదానంలో (ఆర్యావర్తనం) భూమి ఏటవాలు తూర్పు మరియు ఉత్తర దిశలకూ ఉంది కాబట్టి వర్షపు నీరు, వాడుక నీరు సులభంగా పోవటానికి భూ ఉపరితల నీటి వాలు తూర్పు పడమరలకు ఉండాలనే సూత్రం ఏర్పడి ఉండవచ్చు అనే నా యుక్తీకరణకు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఆనాడు నివాస ప్రదేశం వరద ముంపుకు లోనుకాకుండా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో భూ ఉపరితల వాలుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికి వరదలకు, భారీ వర్షాలకు అనేక జనావాసాలు ముంపుకు గురిఅవుతున్న విషయం గమనించే ఉంటారు.  క్రీస్తు పూర్వం 1000-1500 సంవత్సరాల మధ్యలో గంగాతీరంలో ఆర్యులు జీవించారని, గుడిసెల్లో గుడారాలల్లో తిరిగిన ఈ దేశదిమ్మెరలకు వాస్తు శాస్త్రం తెలియదని, ఆతరువాత కీ.శ 5 శతాబ్దిలో నాటి జ్యోతిష్య, ఖగోళ గ్రంథాలైన కాలామృతం, బృహత్సంహితాదులలో వా

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 2

ఏదైనా ఒక విషయం పై మనస్సులో ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడితే దానికి గురించిన విషయ పరిశీలనలో మరొకరి అభిప్రాయాలను పట్టించుకోరు. ఇలాంటి వారు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటూ ముందుగా  ఏర్పరుచుకున్న ఇనుప చట్రం లో దాన్ని బిగించి గిరగిరా తిప్పి చాకిరేవులో ఉతికి ఆరవేయటం నైజం. నిక్షపాక్షిక పరిశీలన లోపిస్తే నిజాలు మరుగున పడతాయి. ఇది రావిపూడి వారి వాస్తువు శాస్త్రమా? లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భూతాలు - దిక్కులు    వాస్తును అర్ధం చేసుకోవటానికి పాఠకులకు దానిలో ఉన్న పదాలను ముందుగా పరిచయం చేయటం పరిశోధనా గ్రంథాలలో తప్పని సరి అంశం. వాస్తువు గ్రంథ రూపంలో వచ్చేటప్పటికి (క్రీ.శ. 4-5 శతాబ్దాలు) పంచ భూతాలు మాత్రమే వారికి తెలుసు. చార్వాకులు నాలుగు భూతాలు అన్నారు, ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇవి ఏవి మూలకాలు కాదని చెప్పారని అంటూ రావిపూడి వారు అసలు విషయాన్ని ప్రక్కకు తీసుకువెళ్లడం వారి అసహనాన్ని మాత్రమే తెల్పుతుంది. అలాగే దిక్కులు, దిక్పాలకుల గురించి. ఆనాటి వారికి ఒక ప్రదేశాన్ని నాలుగు ప్రధాన దిక్కులతో నాలుగు విదిక్కులతో విభజించటమే తెలుసు. భూమిని 360 డిగ్రీల కోణంలో, ఒకడిగ్రీ మరల 60 నిమిషాలుగా, ఒక నిమిషం 60 సెకండ్

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష-1

ప్రముఖ హేతువాది శ్రీ రావిపూడి వెంకటాద్రి గారి రచన 'వాస్తువు శాస్త్రమా ?' పై 2001 లో నేను రాసిన ఈ సమీక్ష నాచే రచింపబడిన 'వాస్తులో ఏముంది?' మరియు 'వాస్తులో వాస్తవాలు' అనే పుస్తకాలపై వారు చేసిన విమర్శకు వివరణ ఇవ్వటమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని సరైన కోణంలో అవగాహన చేసుకోవటానికి, ఉపకరిస్తుంది భావిస్తున్నాను.  తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావని అన్నట్లే హేతువాదం పేరుతో గ్రంథ రచయిత చెప్పినవన్నీ వాస్తవాలు కావు. హేతువాది పత్రికలో 'వాస్తులో వాస్తవమెంత?' అనే శీర్షిక పేరుతో ప్రఫుల్ల చంద్ర గారు రాసిన వ్యాసాలను భూమికగా  చేసుకొని వాస్తుపై పెద్ద పుస్తకం రాయాలనే కుతితో ఈ పుస్తకాన్ని రాసినట్లు రావిపూడి గారు ముందుమాటలో చెప్పుకున్నారు. అలాగే పుస్తకానికి 'వాస్తులో వాస్తవమెంత?' అనే పేరు పెడితే వాస్తులో 'వాస్తవం' ఎంతో కొంత ఉంటుందేమోనని శంకతో దీనికి వాస్తువు శాస్త్రమా? అనే పేరు పెట్టారట. ఆహా ఏమి హేతువాదం? ఒక విషయం పై ముందే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తన వాదం నెగ్గటానికి వితండవాదం చేయటం వారికే చెల్లు. వాస్తు అనేది శాస్త్రం కాదు, కాదు, కానేకాదు అ