Skip to main content

అమరావతి - ఆవశ్యకత - 3

చేఎత్తి జే కొట్టు తెలుగోడా , గతమెంతో ఘనకీర్తి గలవోడా .. అనే ప్రబోధ గీతం తో ఒకనాడు నిద్రాణస్థితి నుండి మేల్కొన్న జాతి , ఆత్మ గౌరవనినాదంతో కదం తొక్కిన తెలుగు జాతి విభజనతో దగాపడితే ఆత్మవిశ్వాసం కలిగించి అభిమానంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకొన్ననేలఅమరావతి. ఇది బుద్దిమాధవ్యం గలవారికి భ్రమరావతిగా కనిపించవచ్చు.అలాంటి వారి భ్రమలు తొలగి సౌమ్య అమరావతిగా నూతన తేజస్సుతో నవ్యఆంధ్ర రాజధానిగా అవతరిస్తుంది. ఆంద్ర జాతి ఉన్నంతవరకు అమరావతి శాశ్వితంగా ఉండటానికి ఉపకరిస్తున్న అనేక సాంఘిక, ఆర్థిక కారణాలతో పాటు రాజకీయ, నైసర్గిక, నైతిక విషయాలు ప్రస్తావించుకుందాం.
1. రవాణా సదుపాయాలు
a) విజయవాడ లో 1888 లో ప్రాంభించబడి దాదాపు 132 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న అతి పేద్ద రైల్వే కూడలి ఉంది. 22 ట్రాక్స్ తో ,10 ఫ్లాట్ ఫార్మ్స్ నుండి ప్రతి రోజు 1.5 లక్షల ప్రయాణికులకు సేవచేస్తూ దేశంలోనే 4వ అతి పెద్ద స్టేషన్ గా విలసిల్లుతుంది.
b) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు సేవలందించి 2003లో పౌర విమానాశ్రయంగా మారి దినదినాభివృద్ధి చెందుతున్న గన్నవరం విమానాశ్రయం జోడవటం అమరావతికి కలిసివచ్చిన అంశం.
c) జాతీయ రహదారులు NH - 16,( చెన్నై-కలకోత్త) NH -65 (మచిలీపట్టణం-హైదరాబాద్) తో పాటు NH-30 ( ఛత్తీస్ గడ్ - విజయవాడ) ఉండటంతో అమరావతికి అన్ని ప్రాంతాలతో అనుసంధానం వచ్చింది.
d) చౌకైన జల రవాణాకు కృష్ణ నది, బకింగ్ హమ్ కాలువ , మచిలీ పట్నం పోర్ట్ లు కూడా అనువుగా ఉన్నాయి.
ఇలా ఒక కొత్త నగరాన్ని దేశంలోని వివిధ ప్రదేశాలకు అనుసంధించాలంటే చాలా ఖర్చుతో రహదారులు నిర్మించాలి.
2. నీటి వసతి
1855 లో కృష్ట్ణ నదిపై కట్టిన ఆనకట్ట తిరిగి 1957 లో పునర్మించిన ప్రకాశం బ్యారేజ్ వల్ల కృష్ణ డెల్టా లో 12 లక్షల ఎకరాలకు సాగునీరు, విజయవాడ, గుంటూరు, మంగళగిరి,తెనాలి వంటి అనేక పట్టణ ప్రాంతాలకు, గ్రామాలకు తాగునీరు అందిస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా నీరు సమృద్ధిగా లభించటానికి గోదావరి జలాలను తరిలించే పట్టిసీమ ప్రాజెక్టు ఉంది. ఇలా జీవనదులైన కృష్ణ గోదావరి సుజలాలతో నూతన రాజధాని అమరావతికి ఆచంద్రతారక్కం నీటి కొరత రాదనీ ఘంటాపధంగా చెప్పవచ్చు.
3. స్థల సమీకరణ
సంవృద్ధిగా నీరు, చక్కటి రవాణా సౌకర్యాలతో ఉన్నచోట 2013 భూసేకరణ చట్టం ప్రకారం రాజధానికి కావలిసిన భూమిని సేకరించటం బహు కష్టసాధ్యమైన విషయం. దానిని సుసాధ్యం చేస్తూ ఈ ప్రాంతంలో 29 గ్రామాల్లోని రైతులు స్వచ్చందంగా భూ సేకరణ పద్దతిలో 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వటం ప్రపంచ చరిత్రలో ఇదే ప్రధమం. వారి స్ఫూర్తికి, త్యాగానికి, విశ్వాసానికి, అభిమానానికి విలువకట్టటం క్షమార్హం కాదు. ఈ స్థితిలో రాజధానిపై పునరాలోచనలు సహేతుకం కాదు.
4. కేంద్ర బిందువు
ఈనాడు 13 జిల్లాలతో ఉన్న నవ్యఆంధ్ర రాష్ట్రం లో అమరావతి రాష్ట్రానికి నడి బొడ్డున గుంటూరు జిల్లాలో ఉంది. దీనికి ఉత్తరాన 6 జిల్లాలు దక్షిణాన మరో ఆరు జిల్లాలు ఉన్నాయి. ఒక కొసనున్న శ్రీకాకుళం నుండి 470 కిలోమీటర్ల అయితే మరొక కోసనున్న అనంత పురం నుండి 450 కి. మీ. దూరంలో ఈ రాజధాని ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం ప్రజలు రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నారన్న సంగతి గమనార్హం. విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్స్, తాడేపల్లి, మంగళగిరి మునిసిపాలిటీలు నూతన రాజధానిలో ప్రచ్ఛన్న పరిధిలోనే ఉన్నాయి.
5. నగర ప్రణాళిక
అద్భుతమైన హరిత- నీలి ప్రణాళికతో, రాగాల 50 ఏళ్ళ అవసరాలను దృష్టిలోనుంచుకొని సింగపూర్ ప్రభుత్వ సహాయ సహకారాలతో రూపు దిద్దుకున్న మాస్టర్ ప్లాన్ అనేకమంది సాంకేతిక నిపుణుల ప్రశంసలు పొందాయి. క్రమబద్ధంగా,కళాత్మకంగా, కమనీయంగా ఉన్న కట్టడాలు, పర్యావరణ హితంగా, పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రసిద్ధి చెందేలా ఉన్న ఈ నగర ప్రణాళిక మార్చటం మంచిదికాదు. ఇది ఒక్క రోజుతో పూర్తి అయ్యే పనికాదు. దీర్ఘకాలం పట్టే నిర్మాణంలో కురచ ఆలోచనలు, కుచ్చిత పనులు జాతి ప్రగతిని అడ్డుకుంటాయి.
6. ఆర్థిక వనరులు
గెలుపు - గెలిపించు పద్దతిలో సమీకరించిన భూమి అభివృద్ధి చెందితే ఇచ్చిన రైతులకు, తీసుకున్న ప్రభుత్వానికి ఆర్థిక లాభం కలుగుతుంది. దీనికి ప్రభత్వ ధనం పెద్దగా అవసరం లేదు. అన్ని వర్గాలకు ఆవాసంగా ప్రజా రాజధానిగా రూపాంతరం చెందవలిసిన అమరావతిపై కుల/ప్రాంత ముద్రవేసే మాటలు తగదు. అమరావతిపై అసూయా, ద్వేషం పెంచటం జాతి ద్రోహం. సాంకేతిక విషయాలలో అవగాహన లేకుండా అవాకులు చెవాకులు వాగటం సరికాదు.
పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో 1953లో దగాపడి ఒక్క ఓటుతో విజయవాడ లో ఉండాలిసిన రాజధాని కోల్పోయిన ఆంధ్రజాతి తిరిగి 66 ఏళ్ల తరువాత మరోసారి అమరావతికి చేరటం ఆంధ్రుల అదృష్టంగా భావించాలి. చేతికి వచ్చిన అన్నాన్ని కాలితో తన్నకండి. అమరావతి నిర్మాణాలను కొసాగించండి. అమరావతిలో రాజధాని ఉండటం వాల్ల రాష్ట్రం మొత్తానికి లాభమే కానీ ఏ ప్రాంతానికి నష్టం వాటిల్లదు. వికేంద్రీకరణ పేరుతో రాజధానిని చిన్నాభిన్నం చేయటం విజ్ఞత కాదు.ఆంధ్రులు ఆవేశపరులే కానీ ఆలోచనా శున్యులు కారని వెలుగెత్తి చాటుదాం. కుల, మత, ప్రాంత రాజకీయ భేదం లేకుండా ఐక్యత చాటుదాం. అమరావతి అందరిదీ అని ప్రకటిద్దాం. (సశేషం)
ఆచార్య కొడాలి శ్రీనివాస్

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర