Skip to main content

రాజధాని - నగర వాస్తు -1

రాజ్యానికి రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది . రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది.ఇలాంటి సంకట స్థితిలో విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి. 

రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. 

1. నగర వాస్తు

"వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం.
వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ/నగరవాస్తు' పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. 

వీటిలో కొండల పై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే 'భూ దుర్గం' అని వర్గీకరించారు. శత్రు భయం లేని చోట భూ దుర్గాలు సర్వ శ్రేష్టం అని చెప్పబడింది. 
రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండి రాకపోకలకు అనువుగా ఉండేలా రాజధానిని నిర్మించాలని, అది నివాస యోగ్యం ఉండాలని చెప్పారు. మహా భారతం లో శ్రీకృష్ణుడు పాండవుల కొరకు ఖాండవ వనాన్ని నిర్దాక్షణ్యంగా నిప్పు పెట్టి ఇంద్రప్రస్థం పేరుతో వన దుర్గాన్ని, తన కొరకు సముద్రంలో ద్వారక పేరుతో జల దుర్గాన్ని నిర్మించాడని చెప్పబడినది. అలాగే చరిత్ర పుటలు తిరగేస్తే బోలెడన్ని కొండలపై కట్టిన గిరి దుర్గాలు, నదీ తీరం లో వెలిసిన రాజధానులు దర్శనం ఇస్తాయి. 
అలాగే నదికి ఉత్తర తీర దిశలో నిర్మించే నగరాన్ని 'సౌమ్యపురం' అని, దక్షిణ తీరం లో కట్టే వాటిని 'ధర్మ పురం' అని చెపుతూ నదికి ఇరు తీరాలలో నగరాలు నిర్మించ వచ్చునని చెప్పబడింది. నగరానికి ఉత్తర దిశలో మాత్రమే నీరు ఉండాలనే సిద్దాంతం కుడా తప్పే . 
అయితే నివాసం గా ఏ ప్రదేశం శ్రేష్టం అనే విషయం గురించి 13 వ శతాబ్దికి చెందిన సుమతీ శతక కవి బద్దెన ఒక వాస్తవిక వాస్తు సూత్రం చెప్పాడు 

అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు 
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును 
ద్విజుఁడున్ జొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ! 

ఋణము ఇచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడు ప్రవహించు నదియును, విద్యావంతుడు గల గ్రామమందు నివసించుము. వారు లేనట్టి గ్రామమునందు నివసించకు అని చెప్పిన మాట నిత్య సత్యం. ఈ లక్షణాలు నూతన రాజధానికి కుడా అవశ్యమే. 

ఉన్నంతలో ఈ లక్షణాలు విజయవాడకు మాత్రమే ఉన్నాయి. పరిశ్రమలు కట్టగలిగే ఆర్దిక బలం గలవారు, విద్యావంతులు, వైద్యులు , ఎల్లప్పుడూ పారే కృష్ణా నది తో నీటి వసతి ... ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే ఇది నివాస ప్రదేశం గా ఆనాటి నుండి నేటివరకు విరాజిల్లుతున్నది. అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఇది నడిబొడ్డు. రాష్ట్రం నలుమూలల నుండి రాకపోకలకు అనువైన ప్రదేశం. నదికి ఇరు ప్రక్కల నదీ ముఖ రాజధానిగా ఇది విరాజిల్లుతుంది. 
శత్రు భయం లేని ప్రాంతం. సురక్షిత ప్రదేశం. కొందరు ప్రచారం చేస్తున్నట్లు భూకంపాలు, తుపానుల వల్ల పెద్ద ప్రమాదాలు ఏమి రావు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో వీటిని అధికమించ వచ్చు. 
ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరం కొరకు ఐదు వేల ఎకరాల పంట భూములు పణంగా పెట్టలేమా? ఇలా వాదిస్తే సాగర్, శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులు కట్టేవారమా? రేపు పోలవరం వద్దా? ఒకప్పుడు ఇలాంటి వాదనే తెచ్చి విజయవాడను రాజధానిగా కాకుండా అడ్డుకున్నారు. 
నగర రూపకల్పన నగర రూప శిల్పులు చేయాలే కాని రాజకీయ వేత్తలు కాదు. నగర వైశాల్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనే సాంకేతిక విషయాల జోలికి మనం వెళ్ళటం మంచిది కాదు. 
నూతన రాజధాని నిర్మాణానికి కి అడ్డు పుల్లలు వేసి చరిత్ర హీనులు కాకండి.ఇప్పటికే ఆంధ్రులకు తీరని అన్యాయం చేసి లక్షలు బొక్కిన గుంట నక్కలు సన్నాయి నొక్కులు తో సరికొత్త కుట్రకు పన్నాగాలు వేస్తున్నాయి. ఇలాంటి వారిని దరిచెరనివ్వరాదు 
భావి తరాలు భవిషత్ ను దృష్టి లోనుంచుకొని సొగసైన, సౌకర్యవంతమైన, సుసంపమైన పచ్చని పర్యావరణ హితమైన సుందర రాజధానిని తెలుగు జాతి గర్వపడేలా, పరులు మెచ్చేలా గొప్పగా నిర్మించుకుందాం. ఈ బృహత్తర మహా నగర నిర్మాణం లో మనం సైతం సహాయ సకారాలు అందించుదాం. ...... (సశేషం )
Prof.Kodali Srinivas

Comments

The Leader said…
Very Good Article sir
shiraakiputra said…
కేవలం పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి అందరికీ సమాన దూరంలో ఉండాలి అంటూ అందుకు అనువైనది విజయవాడ ఒక్కటే అంటూ ముక్త కంఠంతో గొంతెత్తి పాడటం ఆపేసి కాస్త స్థిమితంగా ఆలోచించండి!
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ యుగంలో మనిషి కదలకుండా అన్ని పనులు చేసుకుంటున్న వెసులుబాటు ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా సమాన దూరం అనే సిద్ధాంతం అవసరం లేదు.
రాజధానికి భూసేకరణ అంటూ రైతులను మభ్యపెడతారెందుకు? ఆది మానవ యుగం నుంచి తరతరాలుగా వస్తున్నది వ్యవసాయం. కూడు, గుడ్డ, గూడు క్రమంలో మొట్టమొదటి కూడు మనందరికీ అందించేది రైతులే ! ఎన్నో తరాలుగా చేస్తున్న ఆ వృత్తిని వారు వదలిపెట్టి మరో వృత్తినో, వ్యాపకాన్నో చేపట్ట గాలుగుతారా? కోట్ల రూపాయలు వస్తాయన్న ఆశలతో వారిని ముంచెత్తి బంగారంలాంటి భూములను కాంక్రీటు అరణ్యాలుగా మార్చదలచారా?
భారత దేశంలోనే అత్యంత సారవంతమైన భూభాగాలలో కోస్తా భూములు ఒకటని మీకు వేరుగా చెప్పనక్కర లేదు. నీటి వసతులు, చక్కటి వాతావరణం, వరదల ద్వారా వచ్చే ఒండ్రు- వీటన్నిటినీ
మించి వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు పండిస్తున్న పంటలను గురించి ఆలోచించండి. రాబోయే ఎన్నో తరాలు వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిఉంది. ఆహారం మీద ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో కోస్తా భూముల మీద కన్నేసి కోట్లు దండుకోవాలనుకునే వారిని కట్టడి చేసి సాగు భూములను కాపాడండి. భవిష్యత్తులో రాబోయే వారికి తిండి పెట్టండి.
కేవలం 13 జిల్లాలు కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అనే స్పృహ ఉండాలి. రాజధాని అంటే అసంబ్లీ మాత్రమే అనే వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి . చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానం తో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు. అది హైదరాబాద్ లా అస్తవ్యస్త మహా నగరం కాకూడదనే ముందు చూపు తో సరైన పట్టణ ప్రణాళిక రూపొందించుతున్న వారికి వీలైతే మంచి సలహాలు ఇవ్వండి. భూ సేకరణ అనేది అందరికి మంచి కొరకు ఎంచుకొన్న పధకం. అయితే రాజధాని అయితే తమ పొలాలు రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇచ్చి గజాల లెక్కన అమ్మితే నాలుగింతలు డబ్బు వస్తుందని అత్యాస పరులకు కడుపు మంట గానే ఉంటుంది.
ఇకపోతే పచ్చని పంట పొలాలు అన్నారు. అక్కడ సేకరణ చేసే భూమిలో దాదాపు 80 శాతం మెట్ట భూమి అని, వాటిలో కొన్ని వరద ముంపు చేలు అని తెలుసుకొని వ్యాఖ్యానిస్తే బాగుండేది. పంట పండించే రైతులు ధర లేక చాలా ప్రాంతాలలో వరి పండించటం మానిన సంగతి తెలిస్తే మీలాంటి స్వార్ద వాదుల తిండికి డోకా లేదన్న విషయం అర్ధం అవుతుంది, ఇక్కడ సాగు ఆగితే ఇదే బకింగ్ హం కాలువ కింద నీరు అందని పొలాలు రెట్టింపు పరిణామం లో ఉన్నాయన్న విషయం ఇక్కడికి వచ్చి చూచి తెలుకొండి.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు లక్షల కోట్లు దండుకొన్న వారికి వారిని నిస్సిగ్గుగా బలపరిచే వారికి ప్రతి పనిలోనూ కోట్లు దండుకోవటమే తెలుసు, ఇలాంటి పోకడల వల్లే ఆంధ్రులు చులకన అయారన్న సంగతి తెలుసుకోండి.
అలాగే రైతులు - రైతు కూలీలు తరతరాలుగా అలాగే బ్రతకాలనటం మానవత్వం అనిపించుకోదు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి ఇతర వ్యపకాలలోకి వెళ్ళారు. రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి , వాటికి గిట్టు బాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే. సరుకు లభ్యత ఎక్కువ ఉంటె ధర తక్కువ అన్న వ్యాపార సూత్రం అర్ధం అయితే పంట పొలాలు పోతున్నాయన్న ఏడుపు రాదు

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది