Skip to main content

నాయకులకు వాస్తు భయాలు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తు వశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి. దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. 
ఈనాడు సౌజన్యంతో 
తెలంగాణ ముఖ్య మంత్రి KCR కు వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తు పిచ్చి ఉంటె వారి సొంత ఇంటికి అదీ చాలకపోతే తెరాస పార్టీ భవనంకు సరి చేసుకోవాలి.పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వక్ర దృష్టి సచివాలయం పై పడింది. 
ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట. చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట. 
అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వాస్తు భవనం కడతాడట. 
ఇన్నాళ్ళు బాగున్న సచివాలయం వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదో వివరించాలి. గలీజు చరిత్ర వాస్తుతో పోతుందా?
ఒక వేళ సచివాలయం వాస్తు కుదరక రాష్ట్రం రెండు ముక్కలైనదా? లేక గలీజు రాజకీయంతో వీళ్ళు పోరాడింది ఏమైనా ఉందా?
వాస్తు దోషం ఉన్న దానిలో పరిపాలన ఉంటె బంగారు తెలంగాణా మూడు ముక్కలు అవుతుందనే భయమా ? 

అలాగే ఈ మధ్య ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయంలో ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు గారి కార్యక్రమం కుడా రెండు సార్లు అర్దాంతంగా వాయద పడటానికి కారణం వాస్తేనని గుంటూరులో చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
రేపు ఈ ముఖ్యమంత్రులు కట్టే భవనాలు సింగపూరు ఆధునిక పద్దతులలో కడతారా లేక దేశవాళి వాస్తును బట్టి కడతారా? 
నేడు రాష్ట్రాల కి దశ దిశ నిర్దేశించవలిసిన నాయకులు ఇలా వాస్తు పేరుతో దిశలకు లొంగిపోవటం శోచనీయం. ఇంగిత జ్ఞానం కోరవడుతున్నది. కార్యా కారణాలు గురించిన వివేకం నశిస్తున్నది. 
ప్రమాణ స్వీకారం నుండి కార్యాలయం, అధికార నివాసం వరకు అన్నిటికి ముహూర్తాలు , వాస్తు సలహాలు పాటించటం చాల సర్వ సాదారణ విషయం గా మారింది. 
ముహూర్తాల వల్ల ప్రజా ధనానికి పెద్దగా దండుగ లేదు. కాని ప్రజా ధనం వాస్తు మరమ్మతులకు, కొత్త కట్టడాలకు దుర్వినియోగం అవటం శోచనీయం. 
అసలు వాస్తు విషయంలో మన ప్రజా ప్రభుత్వల పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
ప్రభుత్వం నిర్మించే/వినియోగించే భవన,గృహల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా?
ఒక వేళ పాటిస్తే, దేనిని ప్రమాణంగా తీసుకుంటారు?
ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి?
వాస్తు కొరకు కొత్త భవనాలు కట్టవలిసిన అగత్యం ఎందుకు వచ్చింది? 
కాల క్రమేణా రాజకీయ పార్టీ లను బట్టి, సిద్దాన్తులను బట్టి వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా?
మనుషులను బట్టి, పదవులను బట్టి, సిద్దాన్తులను బట్టి వాస్తు మారుతుందా? వాస్తు వ్యక్తి గతమా ?
ప్రభుత్వానికి అధికార వాస్తు పండితుడు అంటూ ఎవరైనా ఉన్నారా?
ఉంటె,గింటే అతను దేన్నిప్రామాణికంగా వాస్తు చెబుతాడు? 
వాళ్ళు చెప్పే వాస్తు సలహాలు రోడ్లు,భవనాల శాఖ నియమావళికి అంటే సివిల్ ఇంజనీరింగ్ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? 
భవిషత్తులో వచ్చే అన్నిరకాల అనర్ధాలకు, ఆర్దిక అగచాట్లకు ఇప్పుడు ముఖ్యమంత్రులకు సలహాలు/ సూచనలు ఇచ్చే వాస్తు సిద్దాంతి భాద్యత తీసుకుంటాడా?
ఒక వేళ ప్రభుత్వం వాస్తు పాటించదు అంటే , మరి ఏ నిబంధనల ప్రకారం పభుత్వ భవనాలకు వాస్తు మరమ్మతులు చేశారు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడు ఎవ్వడు?

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .