Skip to main content

అపార్ట్ మెంట్స కి వాస్తు వర్తిస్తుందా?

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్సకు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది. 
ఈ దేశవాళీ వాస్తు వల్ల అపార్టుమెంట్స నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈనాటి అపార్ట్ మెంట్సకు ఆనాటి మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు.

ఈనాడు మన దేశంలో బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్మెంట్స దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ ఖండంలో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. అనేక దేశాలలో నేడు కోట్లాది మంది ఈ అపార్టుమెంట్లునందు నిక్షేపంగా జీవిస్తున్నారన్నది పరమ సత్యం. వీటి ఆకృతుల వెనుక మన వాస్తు సూత్రాలు ఏమాత్రం లేవన్నది కఠోర వాస్తవం. వాస్తును పరిగణలోనికి తీసుకొని ఈ సామూహిక గృహాలలో నివసించే వారందరికి కలగని కష్టనష్టాలు ఇక్కడ మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు. 
నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని 'రెండు' ఇళ్లు కట్టుకోవటాన్ని గృహవాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవటం విజ్ఞత ఎంత మాత్రం కాదు.
నిజానికి అపార్టుమెంట్సలో ప్రతి ఫ్లాటును ఒక ఇల్లుగా పరిగణిస్తూ, వాటికి దిశలను బట్టి వాస్తు ను పాటిస్తూ నిర్మించిన అపార్ట్ మెంట్స్ లో గాలి,వెలుతురు సరిగా ఉండదు.
ఆగ్నేయంలో అగ్ని, నైరుతిలో బరువు అని మాస్టర్ బెడ్ రూం, ఈశాన్యములో నడక,నీరు,పూజ, ఉచ్చంలో డోర్లు/కారిడార్లు, తూర్పు నడక ఉత్తరం పడక,మరుగు దొడ్డి  ...
ఇలా పది పడికట్టు సాదా సీదా వాస్తు సూత్రాలను పట్టుకొని, ఇవే విశ్వవాస్తు అనే వారి మాటలకు విలువ ఇచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకోకండి. 
నిజానికి ఒక్కో అపార్ట్ మెంట్ కు ఒక్కో ఓరియంటేషన్ పాటించాలి. అన్నిటికి పొయ్యి ఆగ్నేయం లోనే అంటే ఎలా? నాలుగు దిశలకు నాలుగు విధాలా వాస్తుసూత్రాలు ఉన్నాయన్న సంగతే తెలియని ఆవారాసిద్దాంతుల బడాయిమాటలకు విలువియ్యకండి. 
ప్రధానంగా అపార్టుమెంట్లో చూడవలిసినది, ప్రాధాన్యం ఇవ్వవలిసింది మన దేశవాళీ వాస్తుకి కాదు. గాలి, వెలుతురు ప్రసరణతో పాటు అపార్టుమెంటు నిర్మాణంలో నాణ్యత, పటిష్టత,భద్రత, సౌకర్యం, సౌందర్యం వంటి సప్త విషయాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
పైన పటారం లోన లొటారం అని వాస్తు ముసుగులో నాసి రకం అపార్టుమెంట్లు  బలహీనంగా నిర్మించి దానికి 'వాస్తు బలం' చూపుతూ అంట గట్టే వారికి దూరంగా ఉంటే మంచిది. 
తుపానులు, భూకంపాలు వంటి విపత్తులు వస్తే తట్టుకునే బలం ఉన్న భవనాలు మనకి కావాలి. అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కల్పించే లా వసతులు ఉండాలి. వీటిలో ఏ ఒక్క విపత్తుకి  'వాస్తు బలం' మనకు రక్షణ ఇవ్వదు. 
పూర్వం ఎప్పుడో దేశ,కాల పరిస్తుతులను బట్టి రూపొందించిన వాస్తు సూత్రాలు నేడు అన్నిటికి పనికి వస్తాయనటం సరికాదు. 
కాల దోషం పట్టిన వాస్తును వదిలి విశ్వవ్యాప్తంగా ఆమోదించిన నవీన సాంకేతిక విజ్ఞాన్ని అపార్టుమెంట్ల నిర్మాణంలో సాదరంగా స్వాగతించండి. 
ఆధునిక జీవనాన్ని సుఖవంతంగా క్షేమంగా ఉండేలా చూసుకోండి.
ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

Comments

అపార్ట్మెంట్ కే కాదు, గుడిసెకి కూడా వాస్తు వర్తించదు. వేరే దేశాలలో ఎవరూ వాస్తు ప్రకారం ఇళ్ళు కట్టుకోరు. ఆ దేశాల వాళ్ళకి లేని సమస్యలు ఇక్కడ మాత్రమే ఎందుకు వస్తున్నాయి?
ప్రవీణ్ మీరు చెప్పినది అక్షర సత్యం. గుడెసకి, గుడికి పనికి వచ్చే సదా సీదా ప్రాధమిక విషయాలు ఆనాడు రుపోందిచారన్న దానిలో ఎట్టి విభేదం లేదు. అట్లని ఆనాటి వాస్తు ఈ నాటి నిర్మాణాలకు వర్తింప జేయటం సరికాదు.
వాస్తు మన జీవితాల పై ప్రభావం చూపుతుందన్న ప్రచారం ఒట్టి బూటకం. ఫలిత వాస్తు లో చెప్పేవన్నీ కేవలం ప్రజలలో ఆశ భయాలు జొప్పించి తమ పబ్బం గడుపుకోవటానికి వాస్తు కుక్షింబరులు పుట్టించినవే.దీనిపై చర్చలు జరగాలి.
Anonymous said…
వాస్తు కి పూర్తి విరుద్ధంగా కట్టబడిన ఇంటిలో కొన్నేళ్ళు ఉండి మీరు పరిశోధించి ఈ టపా కొట్టారా? లేక పై పై మాటలేనా? ఒకవేళ మీరు వాస్తు బూటకం అంటే అలాంటి గృహం లో నివసించి ఫలితాలను నోట్ చేసి అప్పుడు ప్రచారం చేయాలి. వాస్తు దేనికి వర్తిస్తుంది దేనికి వర్తించదు లాంటివి చెప్పండి. అది బూటకమనడమే తప్పు. నాడే కాదు నేడు కూడా వాస్తు వర్తిస్తుంది. దానిని ఎలా ఎక్కడ వాడుకుంటాము అనేది ముఖ్యం.

- Krsna

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .