Skip to main content

వాస్తు దోషాలు !!!

ఈ దేశానికే వాస్తు సరిగా లేదని, అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు. మరొకడు రాష్ట్రానికి, ఇంకొకడు జిల్లాలకు, వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే, ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు.
ఇలా గృహ వాస్తు రోజురోజుకి ముదిరి అనేక రంగాలలోకి దూరిపోతున్నది. దేశానికి అంటుకున్న ఈ వాస్తు తెగులుకు మందు వేయాలి, లేకుంటే జాతి నష్టపోయే ప్రమాదం ఉంది. 

ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తీర్మానించి వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందు కుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.
 
నిరాశ, నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివేకం సన్నగిల్లటం సహజం.ఇలాంటి సమయంలోనే విజ్ఞతచూపాలి. ఈ నాటి దేశ రాజకీయాలలో అబద్రతా భావం పెచ్చు మీరి రాజకీయ నాయకులు వాస్తు, గ్రహ బలాలను పట్టుకు వ్రేలాడుతున్నారు. అధికారంలో ఉన్నవారైతే మరీను. ప్రభుత్వ ఆఫీసు లకు,క్వార్టర్స్ కు వాస్తు పేరుతొ రిపేర్లు చేస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారు. వీరిని చూసి ఎందరో సామాన్య జనం కుడా వాస్తు దోషాల పేరుతో వారి కాలాన్ని,ధనాన్ని పోగొట్టుకుంటున్నారు.

ఒక లెక్క ప్రకారం వాస్తు పేరుతొ ఈ దేశంలో షుమారుగా ఏటా ఒక వెయ్యి కోట్లు రూపాయలు వృధా అవుతుందని అంచన. ఈ డబ్బుని ప్రజోప పనులకు ఉపయోగపడితే ఎంత బాగుండు. పదుగురికి మార్గనిర్దేశం చేసేవారు,ప్రజలలో పలుకుబడి/హోదా వుండేవారు,డబ్బు, డాబు వుండే పెద్దలు .. వీరు నడిచే పద్దతిని బట్టి, చేసే పనులను బట్టి ఇలాంటి చిల్లర,మల్లర వాస్తుపనులకు ఆదరణ లభిస్తున్నది. 

అలాగే ఎలక్షన్లలో గెలవటానికి యజ్ఞాలు,యాగాలు చేసే ప్రభుద్దులు, ఇళ్ళకి వాస్తు,పనులకు ముహూర్తాలు,వర్జాలు చూచుకొనే ప్రజా నాయకులకు ఈ దేశంలో కొదవలేదు. దశా నిర్దేశం చేయాలిసిన మన నాయకులు "కుక్క తోకను పట్టుకొని .." దేశాన్ని నడిపిస్తాం అంటుంటే ..చేసేది ఏమి లేదని తల పట్టుకొని కుర్చోవాల, లేక వాళ్ళని కుర్చీలో నుండి దించాలా? వేమన అన్నట్లు 'బుద్ది చెప్పువాడు గుద్దితేనేమి' అని వారికి బుద్ధి రావటానికి మనమేం చేయాలో ఆలోచించండి !!!

Comments

శుభ వార్త !!!
వాస్తు బాగోలేదని ప్రభుత్వ భవనాలను మరమ్మత్తులు చేయించడానికి, లేదా కూలగొట్టి మళ్ళి కట్టడానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుండి కేటాయించరాదని,అలా చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచడమే అవుతుందని ప్రజా సంఘాల నాయకులు శ్రీ ఇన్నయ్య గారి నాయకత్వంలో ది 13 జూన్,2009 న రాష్ట్ర ఆర్ధిక మంత్రి శ్రీ కే.రోశయ్య గారికి వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం పరిసిలించిన రోశయ్యగారు వాస్తుపేరుతో ప్రభుత్వ ధనం వృధాఅవుతున్న మాట నిజమేనని, ఇక పై అలా జరగకుండా అన్ని విభాగాలకు ఆదేశాలు జారి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి గారి ఆదేశాలు ఎంత వరుకు అమలు జరుగుతాయో చూద్దాం.

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .