Skip to main content

వాస్తువు శాస్త్రమా?

వాస్తువు శాస్త్రమా, కాదా అనే విషయం లోఈనాడు విభిన్న వాదనలున్నాయి. నిజానికి వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాలనిర్మాణాలలో విధి విధానాలను శాసించే మన ప్రాచీన నివాస నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు .

నేడు శాస్త్రం అనే పదాన్ని సైన్సుకు పర్యాపదంగా వాడుతున్నారు. వాస్తువు శాస్త్రమా? అనే విషయంలో వాస్తు శాస్త్రం నేటి సైన్సు పరిధిలో ఎంత విలువ ఉంది ? సైన్సుకు వున్నా లక్షణాలు దీనికి వున్నాయా ? అనే విషయంలోనే వాదోపవాదాలు పరిశీలించాలి. అలాగే చర్చలో కేవలం ఫలిత వాస్తును మాత్రమే పరిగణలోకి తీసుకోరాదు. 
నిజానికి వాస్తులో చెప్పబడిన ఫలితాలు శాస్త్రాన్ని తు చ తప్పకుండా ఆచరించటానికి,ఫలితాల పేరుతో ప్రజలను భయపెట్టి శాస్త్రాన్ని అమలు జేయటానికి చేప్పబడినవే. గుడ్డిగా ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వాస్తు ముమ్మాటికి శాస్త్రం కాదు. 
మనఫై వాస్తు ప్రభావం చూపుతుంది అనే వాదనలో వాస్తవం ఇసుమంతైనా లేదు . అదిగో పులి అంటే ... ఇదిగో తోక అనేవారు , దున్న ఈనింది అంటే ... దూడను కట్టేయమనేవారు ఎప్పుడు వుంటూనే వుంటారు. వీరిమాటలు విని భయాందోళనలు చెందనవసరం లేదు. 
పాలకూరలో పాలు, నేతిబీరకాయలో నెయ్యి వుంది అనే మాటల్లో వాస్తవం ఎంతో, వాస్తు లో వాస్తవం కూడా అంతే! కష్ట పడకుండా కాలైనా వంగదనట్లు - కష్టపడకుండా కేవలం వాస్తు తో విజయాలు సాధించటం దుర్లభం. వాస్తు బలం కంటే ఆత్మ బలం పెంచు కుంటే విజయం మన చేరువఅవుతుంది. తాత ముత్తాతల నుండి వారసత్వంగా సంక్రమిస్తున్న చాందస భావాలను విడిచి విశ్వవ్యాప్తంగా పురోగమిస్తున్న సాంకేతిక విజ్ఞాన్ని సాదరంగా స్వాగతం పలుకుదాం .

Comments

sairatna said…
VANDE MAATARAM
Dear Mr Srinivas
AAsheervachanams. As a rationalist you may not like my aasheervachanams. But as an oldman I just cannot change my habbits. So bear with me.
YES PLEASE CARRY ON YOUR CRUSADE AGAINST SUPERSTITIONS SUCH AS VAASTU ETC.
I have recently joined this blog group. When I am getting frustated with the way most of the people are blindly following unscientific rituals etc. your blog has given me great relief. I hope I will see more of your views regularly.
With regards
Maa Ven Rangasai
Is there a way to write these comments in TELUGU ?

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .