మేళ తాళాల సాక్షిగా తోడున్నా నీనెచ్చెలిగా !
రోగాల, రొస్తుల చావు బ్రతుకుల పోరాటంలో బాసటగా నీ కష్టాల కన్నీళ్లను
నిశ్యబ్దంగా దిగమింగా ఓ ప్రాణ నేస్తంగా !
కంటికి రెప్పలా, కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా శైశవం నుండి కొన ఊపిరి దాక నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా !
చెప్పుడు మాటలు చెవికెక్కిన నీచేతిలో దగాపడి నడివీధిలో నాగుబాటుకు లోనైనా ద్రౌపదిలా
నీ అసమర్ధ జీవనయానంలో కాలికి తగిలే ప్రతి రాయికి జన్మనిచ్చిన రాకాసి తల్లిగా !
ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ...
నేరం నీదైతే ...
వాస్తు దోషిగా నాకెందుకు ఈ మరణ శిక్ష ?
Comments