సమస్యలు చుట్టుముట్టినపుడు , అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది. మంచి ఎదో చెడు ఎదో తెలియజేయవలిసిన బాధ్యత ఉంటుంది. సమస్యను పరిష్కారం చేయలేనప్పుదు దాన్ని గజిబిజి చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టే పరిపాలకులకు దశా దిశా నిర్దేశం చూపించాలి. తెలుగు వారి క్షేమం,అభివృద్ధి కోరేవారు అమరావతి రాజధానిపై స్పందించాలి. 1. మంచికో చెడుకో అమరావతిలో నూతన రాజధాని ఉండాలని స్థూలంగా అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. ప్రణాళికలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాప్రదేశం ఎంపికలో ఏకాభిప్రాయం ఉంది. దేశ నలుమూలల నుండి పవిత్ర జలాలు, పుట్ట మన్ను తెచ్చి ప్రదేశాన్ని శుద్ధి పరిచి, పెద్దలందరి సమక్షంలో ప్రధాని స్వహస్తాలతో అమరావతికి శంఖు స్థాపన చేశారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు, ప్రజా ఆమోదంతో మొదలు పెట్టిన పనికి అందరు నిబద్దతతో కట్టుబడి ఉండాలి. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు అని ఆనాడు అంగీకరించి మౌనంగా ఉన్న వ్యక్తులు ఈనాడు ఆక్షేపించటం సరికాదు. 2. రైతుల నుండి సమీకరించబడ్డ భూమిని తిరిగి యధాస్థితికి తెచ్చి వారికి ఇవ్వటం ఇప్పుడు అసాధ్యం. రైతులకు వచ్చిన స్థలాలు కొన్ని అమ్మకాలు కూడా జరిగాయి. ...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.