రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తు వశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి. దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈనాడు సౌజన్యంతో తెలంగాణ ముఖ్య మంత్రి KCR కు వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తు పిచ్చి ఉంటె వారి సొంత ఇంటికి అదీ చాలకపోతే తెరాస పార్టీ భవనంకు సరి చేసుకోవాలి.పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వక్ర దృష్టి సచివాలయం పై పడింది. ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట. చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట. అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వాస్తు భవనం కడతాడట. ఇన్నాళ్ళు బాగున్న సచివాలయం వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదో వివరించాలి. గలీజు చరిత్ర వాస్తుతో పోతుందా? ఒక వేళ సచి...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.