ఈ దేశానికే వాస్తు సరిగా లేదని, అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు. మరొకడు రాష్ట్రానికి, ఇంకొకడు జిల్లాలకు, వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే, ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు. ఇలా గృహ వాస్తు రోజురోజుకి ముదిరి అనేక రంగాలలోకి దూరిపోతున్నది. దేశానికి అంటుకున్న ఈ వాస్తు తెగులుకు మందు వేయాలి, లేకుంటే జాతి నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తీర్మానించి వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందు కుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి. నిరాశ, నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివే...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.