నేటి నగర జీవనంలో ఎక్కువ మందికి వసతి కల్పిస్తున్నవి అపార్టుమెంటులే అనేది వాస్తవం. సొంత ఇంటి కలను నిజం చేసుకోవటానికి ప్రతి కుటుంబం తాపత్రయ పడుతుంది. శుభాశుభ కార్యక్రమాలు స్వగృహంలోనే జరుపుకోవాలనేది సర్వదా వ్యాప్తి చెందిన సూత్రం. అద్దె ఇంటి అగచాట్లు, నిలకడ లేని చిరునామా, అందంగా, పొందికగా సొంతఇల్లు ఉండాలనే కోరికలు, అభిరుచులు, తిన్నా తినక పోయినా గుట్టుగా తలదాచుకునే ఒక గూడు సమకుర్చుకోవాలనే తపన ... వెరిసి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి వ్యక్తి మదిలో ఏదో ఒక సమయాన ఉదయిస్తుంది. పెళ్లి అయిన ప్రతివారు తమకంటూ ఒక ఇల్లు కావలనుకొంటారు. స్థలం తీసుకొని తనకు నచ్చినట్లు నాణ్యతగా ఇల్లు కట్టుకోవాలంటే ఈనాడు కుదిరే విషయం కాదు. అందుకే మనవారు 'ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు' అని అన్నారు. ఈ నానుడి నేటి పరిస్థితులలో కొద్దిగా మార్చుకోవాలి, 'ఇల్లుకొని చూడు-పెళ్లిచేసి చూడు' అని అంటే వాస్తవానికి అతికినట్లు సరిపోతుంది. అనేక మంది ముఖ్యంగా మధ్య తరగతి వారు, ఉద్యోగులు తమ జీవితకాలం కష్టించి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు బ్యాంకు అప్పు జోడించి తమ ఆర్దికశక్తి తగ్గ అపార్టుమెంటును...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.