Skip to main content

Posts

Showing posts from 2012

వాస్తు లో వాస్తవాలు

ఆనాడు తిలక్ మహాశయుడు ప్రజలలో స్వేచ్చ స్వతంత్ర భావాలు రాగాల్చటానికి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టితే నేడు అవి ఒక మత క్రతువుగా, సమాజానికి ఒక గుది బండగా మారాయి. చందాల పేరుతో దండుకోవటం, ఊరేగింపుల పేరుతో తాగి తన్దనాలడటం నేడు ఒక తంతు గా మారింది. వీటికి విభిన్నంగా కృష్ణ జిల్లా పెడన గ్రామం లో శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం వారిచే గత 60 సంవత్సరాల నుండి నిర్విజ్ఞంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారు గణపతి పూజల తో పాటు ప్రతి రోజు ఒక అంశం పై జ్ఞాన సభ జరుపుతూ తిలక్ గారి స్పూర్తి ని కొనసాగించటం నిజంగా అభినందించ వలసిన విషయమే. శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం, పెడన  వారు 23-09-2012 ఆదివారం నాటి జ్ఞాన సభలో నన్ను 'వాస్తు లో వాస్తవాలు ' గురించి ప్రసంగించ వలిసినదిగా కొరగా ఆ వూరు వెళ్ళటం జరింగింది.    శ్రీ కుర్మా నాగభూషణం గారి అధ్యక్షతన జరిగిన ఆ సభలో నా ప్రసంగాన్నిఆద్యంతం ఆసక్తి విన్నారు.  ఆస్తికులు వాస్తును నమ్మాలనటం కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి వాస్తు మతానికి ,దైవ భావానికి శుద్ధ వెతిరేకి. వాస్తు మార్పులు చేసుకుంటే ఇంటి స్వరూపం లో మార్పు వస్తుందేమో కాని మన జీవితాలలో ఎలాంటి మార్పు రాదు.

అపార్ట్ మెంట్స కి వాస్తు వర్తిస్తుందా?

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్సకు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది.  ఈ దేశవాళీ వాస్తు వల్ల అపార్టుమెంట్స నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈనాటి అపార్ట్ మెంట్సకు ఆనాటి మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు. ఈనాడు మన దేశంలో బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్మెంట్స దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ ఖండంలో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. అనేక దేశాలలో నేడు కోట్లాది మంది ఈ అపార్టుమెంట్లునందు నిక్షేపంగా జీవిస్తున్నారన్నది పరమ సత్యం. వీటి ఆకృతుల వెనుక మన వాస్తు సూత్రాలు ఏమాత్రం లేవన్నది కఠోర వాస్తవం. వాస్తును పరిగణలోనికి తీసుకొని ఈ సామూహిక గృహాలలో నివసించే వారందరికి కలగని కష్టనష్టాలు ఇక్కడ మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు.  నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని 'రెండు' ఇళ్లు కట్టుకోవటాన్ని గృహవాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తెచ