ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇలాకాలో ఇదొక అంకం . దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ( దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) 2006లో కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకు ( లేక్ వ్యూ గెస్ట్ హౌస్) వాస్తు దోషం ఉందని , అందుకే ఆయన కు పావురాల గుట్టలో అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ . ( ఆనాడు వై . యస్ . ఆర్ . కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు ( విద్వంసులు ) ఈ తాజావాస్తు రిపోర్టు చూసి ఏమంటారో !) ఈ తాజా వాస్తు పోస్ట్ మార్టం రిపోర్ట్ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి , మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించారు శ్రీ రోశియ్య గారు . సదరు సిద్దాంతి సలహాలతో దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు . రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు . వాస్తు హోమాలు , శాంతి పూజలు చేసి చివరికి ' కుడి కాలు ' పెట్టారు . ' ఎడమ కాలు ' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత ...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.