బంగారు తెలంగాణలో భాగ్య నగరం నడిబొడ్డున ఓ గాడిద గుడ్డేట్టింది. ఆదివారం అమావాస్య అర్దరాత్రి సమయంలో ఆ గార్దాభాండం బద్దలై దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రిలో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా మూడు దినాలు కురిసింది. నాలాలు ఉప్పొంగి ఊరు వాడ ఏకమై సముద్రాన్ని తలపించింది. ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితులు బంగారు భూమికి భూత కీడు దాపురించినదని, ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని సెలవిచ్చిచారు. ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందోనని తెరాసురల అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభి జండాలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోరగాళ్ళు, లావక్కంత లేని న్యాయవాదులు, స్వరనినాదవాగేకారులు, అస్తమానం లొల...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.