ఆనాడు తిలక్ మహాశయుడు ప్రజలలో స్వేచ్చ స్వతంత్ర భావాలు రాగాల్చటానికి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టితే నేడు అవి ఒక మత క్రతువుగా, సమాజానికి ఒక గుది బండగా మారాయి. చందాల పేరుతో దండుకోవటం, ఊరేగింపుల పేరుతో తాగి తన్దనాలడటం నేడు ఒక తంతు గా మారింది. వీటికి విభిన్నంగా కృష్ణ జిల్లా పెడన గ్రామం లో శ్రీ విఘ్నేశ్వర కోలాట భజన సంఘం వారిచే గత 60 సంవత్సరాల నుండి నిర్విజ్ఞంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారు గణపతి పూజల తో పాటు ప్రతి రోజు ఒక అంశం పై జ్ఞాన సభ జరుపుతూ తిలక్ గారి స్పూర్తి ని కొనసాగించటం నిజంగా అభినందించ వలసిన విషయమే. శ్రీ విఘ్నేశ్వర కోలాట భజన సంఘం, పెడన వారు 23-09-2012 ఆదివారం నాటి జ్ఞాన సభలో నన్ను 'వాస్తు లో వాస్తవాలు ' గురించి ప్రసంగించ వలిసినదిగా కొరగా ఆ వూరు వెళ్ళటం జరింగింది. శ్రీ కుర్మా నాగభూషణం గారి అధ్యక్షతన జరిగిన ఆ సభలో నా ప్రసంగాన్నిఆద్యంతం ఆసక్తి విన్నారు. ఆస్తికులు వాస్తును నమ్మాలనటం కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి వాస్తు మతానికి ,దైవ భావానికి శుద్ధ వెతిరేకి. వాస్తు మార్పులు చేసుకుంటే ఇంటి స్వరూపం లో మార్పు వస్తుంద...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.