Skip to main content

Posts

రాజధాని - నామకరణం

పేరులో ఏముంది? అనేవారు కొందరైతే పేరులోనే ఉన్నది పెన్నిది అనేవారు మరికొందరు. ప్రపంచం ఆశ్చర్యపడేలా ఆంధ్రులకు అద్భుత రాజధాని కావాలని కాంక్షించే వారికి దానికి తగిన పేరు కుడా ఉన్నతంగా ఉండాలని ఉబలాటపడటం సహజమే.  మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టటం అన్ని విదాల ఆమోదయోగ్యమైన నిర్ణయం.  అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చి...

వాస్తు భూతం మళ్లీ పుట్టింది

బంగారు తెలంగాణలో భాగ్య నగరం నడిబొడ్డున ఓ గాడిద గుడ్డేట్టింది.  ఆదివారం అమావాస్య అర్దరాత్రి సమయంలో  ఆ గార్దాభాండం బద్దలై దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రిలో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా మూడు దినాలు కురిసింది. నాలాలు ఉప్పొంగి ఊరు వాడ ఏకమై సముద్రాన్ని తలపించింది.  ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితులు బంగారు భూమికి భూత కీడు దాపురించినదని, ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని సెలవిచ్చిచారు.  ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందోనని తెరాసురల అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభి జండాలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోరగాళ్ళు, లావక్కంత లేని న్యాయవాదులు, స్వరనినాదవాగేకారులు, అస్తమానం లొల...

నాయకులకు వాస్తు భయాలు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తు వశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి. దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది.  ఈనాడు సౌజన్యంతో   తెలంగాణ ముఖ్య మంత్రి KCR కు వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తు పిచ్చి ఉంటె వారి సొంత ఇంటికి అదీ చాలకపోతే తెరాస పార్టీ భవనంకు సరి చేసుకోవాలి.పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వక్ర దృష్టి సచివాలయం పై పడింది.  ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట. చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట.  అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వాస్తు భవనం కడతాడట.  ఇన్నాళ్ళు బాగున్న సచివాలయం వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదో వివరించాలి. గలీజు చరిత్ర వాస్తుతో పోతుందా? ఒక వేళ సచి...

రాజధాని - నగర వాస్తు -2

రాజధాని - నగర వాస్తు -1 లో    నవ్యాంద్ర రాజధాని నగర నిర్మాణం లో స్థల ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాలు దీనిలో పరిశీలించుదాం.   ఆంధ్రులకి చాల పురాతన ఘనచరిత్ర ఉంది. ధాన్యకటకం (అమరావతి) నుండి హంపీ విజనగరం వరకు ఎన్నోసార్లు రాజధానులు నిర్మించుకున్న నైపుణ్యం, శక్తి, యుక్తి కలిగిన జాతి. ఆనాటి మన రాజధానులు వాస్తు శాస్త్రం లో ఉన్న సూత్రాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి అనుటలో సందేహం లేదు.   వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు.  రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి.  అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి) వృ...

రాజధాని - నగర వాస్తు -1

రాజ్యానికి రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది . రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి.  రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.  1. నగర వాస్తు "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం. వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'ద...

మన అపార్టుమెంట్ జీవిత కాలం ఎంత?

నేటి నగర జీవనంలో ఎక్కువ మందికి వసతి కల్పిస్తున్నవి అపార్టుమెంటులే అనేది వాస్తవం. సొంత ఇంటి కలను నిజం చేసుకోవటానికి ప్రతి కుటుంబం తాపత్రయ పడుతుంది.  శుభాశుభ కార్యక్రమాలు స్వగృహంలోనే జరుపుకోవాలనేది సర్వదా వ్యాప్తి చెందిన సూత్రం. అద్దె ఇంటి అగచాట్లు, నిలకడ లేని చిరునామా, అందంగా, పొందికగా సొంతఇల్లు ఉండాలనే కోరికలు, అభిరుచులు, తిన్నా తినక పోయినా గుట్టుగా తలదాచుకునే ఒక గూడు సమకుర్చుకోవాలనే తపన ... వెరిసి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి వ్యక్తి మదిలో ఏదో ఒక సమయాన ఉదయిస్తుంది.  పెళ్లి అయిన ప్రతివారు తమకంటూ ఒక ఇల్లు కావలనుకొంటారు. స్థలం తీసుకొని తనకు నచ్చినట్లు నాణ్యతగా ఇల్లు కట్టుకోవాలంటే ఈనాడు కుదిరే విషయం కాదు. అందుకే మనవారు 'ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు'  అని అన్నారు. ఈ నానుడి నేటి పరిస్థితులలో కొద్దిగా మార్చుకోవాలి,  'ఇల్లుకొని చూడు-పెళ్లిచేసి చూడు' అని అంటే వాస్తవానికి అతికినట్లు సరిపోతుంది.  అనేక మంది ముఖ్యంగా మధ్య తరగతి వారు, ఉద్యోగులు తమ జీవితకాలం కష్టించి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు బ్యాంకు  అప్పు జోడించి తమ ఆర్దికశక్తి తగ్గ అపార్టుమెంటును...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది . అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం . త్వరలో నేను ప్రచురించే పుస్తకం " వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను . తగిన పారితోషకం ఉంటుంది . అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .

వాస్తు లో వాస్తవాలు

ఆనాడు తిలక్ మహాశయుడు ప్రజలలో స్వేచ్చ స్వతంత్ర భావాలు రాగాల్చటానికి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టితే నేడు అవి ఒక మత క్రతువుగా, సమాజానికి ఒక గుది బండగా మారాయి. చందాల పేరుతో దండుకోవటం, ఊరేగింపుల పేరుతో తాగి తన్దనాలడటం నేడు ఒక తంతు గా మారింది. వీటికి విభిన్నంగా కృష్ణ జిల్లా పెడన గ్రామం లో శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం వారిచే గత 60 సంవత్సరాల నుండి నిర్విజ్ఞంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారు గణపతి పూజల తో పాటు ప్రతి రోజు ఒక అంశం పై జ్ఞాన సభ జరుపుతూ తిలక్ గారి స్పూర్తి ని కొనసాగించటం నిజంగా అభినందించ వలసిన విషయమే. శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం, పెడన  వారు 23-09-2012 ఆదివారం నాటి జ్ఞాన సభలో నన్ను 'వాస్తు లో వాస్తవాలు ' గురించి ప్రసంగించ వలిసినదిగా కొరగా ఆ వూరు వెళ్ళటం జరింగింది.    శ్రీ కుర్మా నాగభూషణం గారి అధ్యక్షతన జరిగిన ఆ సభలో నా ప్రసంగాన్నిఆద్యంతం ఆసక్తి విన్నారు.  ఆస్తికులు వాస్తును నమ్మాలనటం కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి వాస్తు మతానికి ,దైవ భావానికి శుద్ధ వెతిరేకి. వాస్తు మార్పులు చేసుకుంటే ఇంటి స్వరూపం లో మార్పు వస్తుంద...

అపార్ట్ మెంట్స కి వాస్తు వర్తిస్తుందా?

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్సకు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది.  ఈ దేశవాళీ వాస్తు వల్ల అపార్టుమెంట్స నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈనాటి అపార్ట్ మెంట్సకు ఆనాటి మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు. ఈనాడు మన దేశంలో బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్మెంట్స దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ ఖండంలో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. అనేక దేశాలలో నేడు కోట్లాది మంది ఈ అపార్టుమెంట్లునందు నిక్షేపంగా జీవిస్తున్నారన్నది పరమ సత్యం. వీటి ఆకృతుల వెనుక మన వాస్తు సూత్రాలు ఏమాత్రం లేవన్నది కఠోర వాస్తవం. వాస్తును పరిగణలోనికి తీసుకొని ఈ సామూహిక గృహాలలో నివసించే వారందరికి కలగని కష్టనష్టాలు ఇక్కడ మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు.  నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని 'రెండు' ఇళ్లు కట్టుకోవటాన్ని గృహవాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తె...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

రియల్ అడ్వేజర్

సిరాస్తి కి సంబంధించిన విషయాలతో  'రియల్ అడ్వేజర్'  అనే నూతన మాస పత్రిక మార్కెట్ లోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ కు సంభందించి అనేక అంశాలతో తెలుగులో పూర్తి మల్టికలర్ ఆఫ్ సెట్టింగ్ తో అందంగా రూపుదిద్దుకున్న ఈ మాస పత్రిక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పత్రికలో  ప్రతి నెల వాస్తుకు సంభందించిన విషయాల పై నా వ్యాసాలూ ప్రచురించ బడతాయి. 2011,జూన్ నెల పత్రిక లో  'వాస్తువు - శాస్త్రం'  అనే శీర్షిక తో నా వ్యాసం ప్రచురించ బడినది. ఆసక్తి ఉన్నవారు చదవగలరు. 

శ్రీనివాస్ వాస్తు నీతులు ( శ్రీ వా నీ లు )

శ్రీవానీలు srivaanelu - 2 ( శ్రీ నివాస్  వా స్తు  నీ తు లు ) వరదలు, వడదెబ్బలు కాచుకున్న ఇల్లు వాస్తు గాలికి  కుప్ప కూలింది ! రోగాలు, రోస్టులకు వాస్తు వైద్యం ! దవాఖనాలెందుకు దండుగ ?   ఆలి పై అనుమానం ఇంటి లో వంక  రోగం ఒక్కటే   మందు తినాలి ! ఇల్లు కట్టటం కష్టం  కులగోట్టటం కుటిలం  వాస్తు  బాట పడితే  చేరేది చింతల తోపుకే !  

ప్రభుత్వాలు - వాస్తు దోషాలు

ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇలాకాలో ఇదొక అంకం . దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ( దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) 2006లో  కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకు ( లేక్ వ్యూ గెస్ట్ హౌస్) వాస్తు దోషం ఉందని , అందుకే ఆయన కు  పావురాల గుట్టలో  అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ . ( ఆనాడు వై . యస్ . ఆర్ . కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు ( విద్వంసులు ) ఈ తాజావాస్తు రిపోర్టు చూసి ఏమంటారో !)   ఈ తాజా వాస్తు పోస్ట్ మార్టం రిపోర్ట్ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి ,  మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించారు శ్రీ రోశియ్య గారు . సదరు సిద్దాంతి సలహాలతో దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు .  రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు . వాస్తు హోమాలు , శాంతి పూజలు చేసి చివరికి ' కుడి కాలు ' పెట్టారు . ' ఎడమ కాలు ' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత ...