Skip to main content

Posts

Showing posts with the label కవితలు

గృహ విలాపం

గృహ విలాపం - Gruha Vilapam పండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు, అతిధి మర్యాదలకు రంగు రంగుల వలువలతో  మేళ తాళాల సాక్షిగా తోడున్నా నీనెచ్చెలిగా ! రోగాల, రొస్తుల చావు బ్రతుకుల పోరాటంలో బాసటగా నీ  కష్టాల కన్నీళ్లను  నిశ్యబ్దంగా దిగమింగా  ఓ  ప్రాణ నేస్తంగా !   కంటికి రెప్పలా, కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా  శైశవం నుండి కొన ఊపిరి దాక నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా ! చెప్పుడు మాటలు చెవికెక్కిన నీచేతిలో దగాపడి  నడివీధిలో నాగుబాటుకు లోనైనా ద్రౌపదిలా  నీ అసమర్ధ జీవనయానంలో కాలికి తగిలే ప్రతి రాయికి  జన్మనిచ్చిన రాకాసి తల్లిగా ! ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ... నేరం నీదైతే ...  వాస్తు  దోషి గా నాకెందుకు ఈ మరణ శిక్ష ?

వాస్తు భూతం మళ్లీ పుట్టింది

బంగారు తెలంగాణలో భాగ్య నగరం నడిబొడ్డున ఓ గాడిద గుడ్డేట్టింది.  ఆదివారం అమావాస్య అర్దరాత్రి సమయంలో  ఆ గార్దాభాండం బద్దలై దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రిలో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా మూడు దినాలు కురిసింది. నాలాలు ఉప్పొంగి ఊరు వాడ ఏకమై సముద్రాన్ని తలపించింది.  ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితులు బంగారు భూమికి భూత కీడు దాపురించినదని, ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని సెలవిచ్చిచారు.  ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందోనని తెరాసురల అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభి జండాలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోరగాళ్ళు, లావక్కంత లేని న్యాయవాదులు, స్వరనినాదవాగేకారులు, అస్తమానం లొల...

శ్రీనివాస్ వాస్తు నీతులు ( శ్రీ వా నీ లు )

శ్రీవానీలు srivaanelu - 2 ( శ్రీ నివాస్  వా స్తు  నీ తు లు ) వరదలు, వడదెబ్బలు కాచుకున్న ఇల్లు వాస్తు గాలికి  కుప్ప కూలింది ! రోగాలు, రోస్టులకు వాస్తు వైద్యం ! దవాఖనాలెందుకు దండుగ ?   ఆలి పై అనుమానం ఇంటి లో వంక  రోగం ఒక్కటే   మందు తినాలి ! ఇల్లు కట్టటం కష్టం  కులగోట్టటం కుటిలం  వాస్తు  బాట పడితే  చేరేది చింతల తోపుకే !  

శ్రీనివాస్ వాస్తు నీతులు ( శ్రీ వా నీ లు )

శ్రీవానీలు srivaanelu - 1 ( శ్రీ నివాస్ వా స్తు నీ తు లు ) గాలివాన, వడగాలి  కాచుకున్న ఇల్లు  వాస్తు గాలికి  కుప్ప కూలింది !  వాలు ,వీలు  గాలి, వెలుగు  ఇంటికి బలం  వాస్తుతో బలమెందుకు ? రోగాలు, రొస్టులకు  వాస్తు వైద్యం ! దవాఖనాలెందుకు  దండుగ ? తూర్పు పడమర బొమ్మా బొరుసు  యెదై తేనేమి  విలువ ఒక్కటేగా ! ప్రపంచమంతా వాస్తు మయం వెర్రివాడికి  క్రొత్త కళ్ళజోడు ! ఇంటి కొలతలకు వాస్తు గణితం  అంకెల గారడిలో రెండు రెళ్ళు ఆరు ! చేతికి కడియం  నుదిటిన బొట్టు  వాస్తు,జ్యోస్యాల వ్యాపారాల్లో పగటి వేషగాళ్ళు !  కొంపలు కూల్చే  దైవజ్ఞ, వాస్తు రత్న కిరీట  చోర సిఖామణులున్నారు  తస్మా ఇల్లు జాగ్రత్త! దిక్కు తెలియక దిక్సూచి పట్టాడు కోటి విద్యలు కూటి కొరకేగా ! ఇల్లు పీకీ  పందిరి వెయ్యి ...  వాస్తు వాగేవాడికి  వినేవాడు వెంగలాయి !!!