Skip to main content

Posts

Showing posts with the label వాస్తు వ్యాసాలు

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధ...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 5

EI - విజయవాడ - రచయత ఆచార్య కొడాలి శ్రీనివాస్ వాస్తు పేరుతో సమాజంలో మౌఢ్యం రాజ్యమేలుతుందని, వాస్తు ఫలితాల చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వాస్తు ఫలితాలలో నిజం ఏమాత్రం లేదని, రావిపూడివారు 'వాస్తువు శాస్త్రమా? ' లో అడుగడునా పలుమార్లు నొక్కిచెప్పారు. ఇలా ఇంతకుముందే వాస్తు ఫలాలు అబద్దాలని చెప్పిన ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, హేతువాదులు, నాస్తికులు అనేక మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు వాస్తు శాస్త్రం అనేది ఒకనాటి భారతీయ నిర్మాణ శాస్త్రం అనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఏమాత్రం సంకోచించలేదు. కేవలం రావిపూడి వెంకటాద్రి వంటి ఒకరిద్దరు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించటానికి సంసిద్దంగాలేరు.  ఏ విషయమైనా విమర్శకు గురి అయితేనే దానిలో లోటుపాట్లు బహిర్గతం అవుతాయి. క్రీ.పూ.4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే 16వ శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉండేవి. వీరి రచనలను విమర్శించటం ఆనాడు మతద్రోహంగా భావించేవారు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువుగల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుక...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 4

అర్థాలు - అపార్దాలు   వాస్తు శాస్త్ర మూల గ్రంథాలన్నీ సంస్కృతం లోనే ఉన్నాయి. నేడది మృత భాష. సంస్కృత భాష విలక్షణమైనది. భాష విస్తృతం కానప్పుడు ఓకే పదం అనేక అర్ధాలతో ప్రయోగించటం సర్వ సాధారణం. సాహిత్య ప్రయోగంలో వాడకలో ఉన్న ఒక పదాన్ని విభిన్న అర్థాలతో వాడటం కవుల కల్పనా  శైలికి తార్కాణంగా పేర్కొంటారు. విషయాన్ని బట్టి పదం యొక్క అర్థాన్ని స్వీకరించితే  అర్ధవంతమైన భావం సిద్ధిస్తుంది. గణిత, ఖగోళ, వైద్య, వాస్తు  ఇత్యాది శాస్త్ర గ్రంధాలలో వాడిన పదాలకు తత్సంబంధమైన శాస్త్ర పరి భాష అర్థాలలో  హేతుబద్దమైనవి మాత్రమే అన్వహించుకోవాలి. వాడుక అర్థాలు స్వీకరించ రాదు.  వాస్తు శాస్త్రం అనేది మన సమాజంలో ఆదినుండి, ఆధునిక నిర్మాణాలు వచ్చే వరకు తనవంతు తోడ్పాటు అందించిదన్నది వాస్తవం. ఈ కోణంలోనే నిర్మాణ విషయంలో ఉపయోగించిన పదాలకు సాంకేతిక అర్థాలు స్వీకరిస్తే వాస్తుపై మరింత స్పష్టత వస్తుందని చెప్పుతూ నేను రాసిన పుస్తకమే  'వాస్తులో వాస్తవాలు'. ఈ   పుస్తకంలో ప్రస్తావించబడిన సాంకేతిక పదాల అర్థాలు రావిపూడి వెంకటాద్రి గారికి  కృత్తక అర్దాలుగా, విపరీతా...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 3

వాస్తు పుట్టుక  వాస్తు శాస్త్రం ఎప్పుడు పుట్టిందో, అది ఎప్పుడు గ్రంథస్థం చేయబడిందో తెలుసుకోవటానికి కొంత చారిత్రిక పరిశోధన చేయాలి. అయితే రావిపూడి గారు వాస్తు గ్రంథాలన్నీ 10 శాతాబ్దం తరువాతే వచ్చాయనే తలంపుతో వాస్తు 'ఆర్య వాస్తువా?' అంటూ అహేతుక వాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  ఆర్యులు నివసించిన గంగానది దక్షిణ తీర మైదానంలో (ఆర్యావర్తనం) భూమి ఏటవాలు తూర్పు మరియు ఉత్తర దిశలకూ ఉంది కాబట్టి వర్షపు నీరు, వాడుక నీరు సులభంగా పోవటానికి భూ ఉపరితల నీటి వాలు తూర్పు పడమరలకు ఉండాలనే సూత్రం ఏర్పడి ఉండవచ్చు అనే నా యుక్తీకరణకు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఆనాడు నివాస ప్రదేశం వరద ముంపుకు లోనుకాకుండా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో భూ ఉపరితల వాలుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికి వరదలకు, భారీ వర్షాలకు అనేక జనావాసాలు ముంపుకు గురిఅవుతున్న విషయం గమనించే ఉంటారు.  క్రీస్తు పూర్వం 1000-1500 సంవత్సరాల మధ్యలో గంగాతీరంలో ఆర్యులు జీవించారని, గుడిసెల్లో గుడారాలల్లో తిరిగిన ఈ దేశదిమ్మెరలకు వాస్తు శాస్త్రం తెలియదని, ఆతరువాత కీ.శ 5 శతాబ్దిలో నాటి జ్యోతిష్య, ఖగోళ గ్రంథాలైన కాలామృతం, బృహత్సంహ...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 2

ఏదైనా ఒక విషయం పై మనస్సులో ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడితే దానికి గురించిన విషయ పరిశీలనలో మరొకరి అభిప్రాయాలను పట్టించుకోరు. ఇలాంటి వారు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటూ ముందుగా  ఏర్పరుచుకున్న ఇనుప చట్రం లో దాన్ని బిగించి గిరగిరా తిప్పి చాకిరేవులో ఉతికి ఆరవేయటం నైజం. నిక్షపాక్షిక పరిశీలన లోపిస్తే నిజాలు మరుగున పడతాయి. ఇది రావిపూడి వారి వాస్తువు శాస్త్రమా? లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భూతాలు - దిక్కులు    వాస్తును అర్ధం చేసుకోవటానికి పాఠకులకు దానిలో ఉన్న పదాలను ముందుగా పరిచయం చేయటం పరిశోధనా గ్రంథాలలో తప్పని సరి అంశం. వాస్తువు గ్రంథ రూపంలో వచ్చేటప్పటికి (క్రీ.శ. 4-5 శతాబ్దాలు) పంచ భూతాలు మాత్రమే వారికి తెలుసు. చార్వాకులు నాలుగు భూతాలు అన్నారు, ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇవి ఏవి మూలకాలు కాదని చెప్పారని అంటూ రావిపూడి వారు అసలు విషయాన్ని ప్రక్కకు తీసుకువెళ్లడం వారి అసహనాన్ని మాత్రమే తెల్పుతుంది. అలాగే దిక్కులు, దిక్పాలకుల గురించి. ఆనాటి వారికి ఒక ప్రదేశాన్ని నాలుగు ప్రధాన దిక్కులతో నాలుగు విదిక్కులతో విభజించటమే తెలుసు. భూమిని 360 డిగ్రీల కోణంలో, ఒకడ...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష-1

ప్రముఖ హేతువాది శ్రీ రావిపూడి వెంకటాద్రి గారి రచన 'వాస్తువు శాస్త్రమా ?' పై 2001 లో నేను రాసిన ఈ సమీక్ష నాచే రచింపబడిన 'వాస్తులో ఏముంది?' మరియు 'వాస్తులో వాస్తవాలు' అనే పుస్తకాలపై వారు చేసిన విమర్శకు వివరణ ఇవ్వటమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని సరైన కోణంలో అవగాహన చేసుకోవటానికి, ఉపకరిస్తుంది భావిస్తున్నాను.  తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావని అన్నట్లే హేతువాదం పేరుతో గ్రంథ రచయిత చెప్పినవన్నీ వాస్తవాలు కావు. హేతువాది పత్రికలో 'వాస్తులో వాస్తవమెంత?' అనే శీర్షిక పేరుతో ప్రఫుల్ల చంద్ర గారు రాసిన వ్యాసాలను భూమికగా  చేసుకొని వాస్తుపై పెద్ద పుస్తకం రాయాలనే కుతితో ఈ పుస్తకాన్ని రాసినట్లు రావిపూడి గారు ముందుమాటలో చెప్పుకున్నారు. అలాగే పుస్తకానికి 'వాస్తులో వాస్తవమెంత?' అనే పేరు పెడితే వాస్తులో 'వాస్తవం' ఎంతో కొంత ఉంటుందేమోనని శంకతో దీనికి వాస్తువు శాస్త్రమా? అనే పేరు పెట్టారట. ఆహా ఏమి హేతువాదం? ఒక విషయం పై ముందే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తన వాదం నెగ్గటానికి వితండవాదం చేయటం వారికే చెల్లు. వాస్తు అనేది శాస్త్రం కాదు, కాదు, కానేకాదు అ...

చైనా వాస్తు -ఫెంగ్ షుయి

నీవు నైరాశ్యం లో జీవిస్తున్నావు అంటే భూతకాలంలో, ఆందోళనలో గడుపుతూ ఉంటే భవిషత్ కాలంలో, ప్రశాంతంగా జీవిస్తున్నావు అంటే వర్తమానంలో బ్రతుకుతున్నావని తెలుసుకొ ... అని చైనా తత్వవేత్త తావో ఉపదేశం.   ఈ తత్వం తలకెక్కక తల్లడిల్లే వారెందరో. కష్టనష్టాల ఊబిలో ఊపిరి సలపనివారు, ఆశా భయాల ఊయలలో ఉగిసలాడేవారు వివేకం కోల్పోయి దప్పికతో ఉన్న దుప్పుల్లా ఎండమావుల వెంట పరుగులు పెడుతుంటారు.  సర్వ సంపదలకు, కర్మ ఫలాలకు మన దేశవాళి వాస్తు దారి చూపిస్తుందనే వాస్తు విధ్వంసుల విన్యాసాలతో జరిగిన గృహాల విధ్వంసంతో కుదేలైన జనం తాజాగా చైనా బాటపట్టారు.  కొత్త ఒక వింత - పాత ఒక రోత అన్నట్లు మన పాత వాస్తును వదిలి చైనా వారి సాంప్రదాయక వాస్తు మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు. చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ అనికూడా పిలుస్తారు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రాలు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.   తైజీతు యంగ్-య...

రాజధాని - నగర వాస్తు -2

రాజధాని - నగర వాస్తు -1 లో    నవ్యాంద్ర రాజధాని నగర నిర్మాణం లో స్థల ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాలు దీనిలో పరిశీలించుదాం.   ఆంధ్రులకి చాల పురాతన ఘనచరిత్ర ఉంది. ధాన్యకటకం (అమరావతి) నుండి హంపీ విజనగరం వరకు ఎన్నోసార్లు రాజధానులు నిర్మించుకున్న నైపుణ్యం, శక్తి, యుక్తి కలిగిన జాతి. ఆనాటి మన రాజధానులు వాస్తు శాస్త్రం లో ఉన్న సూత్రాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి అనుటలో సందేహం లేదు.   వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు.  రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి.  అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి) వృ...

రాజధాని - నగర వాస్తు -1

రాజ్యానికి రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది . రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి.  రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.  1. నగర వాస్తు "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం. వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'ద...

మన అపార్టుమెంట్ జీవిత కాలం ఎంత?

నేటి నగర జీవనంలో ఎక్కువ మందికి వసతి కల్పిస్తున్నవి అపార్టుమెంటులే అనేది వాస్తవం. సొంత ఇంటి కలను నిజం చేసుకోవటానికి ప్రతి కుటుంబం తాపత్రయ పడుతుంది.  శుభాశుభ కార్యక్రమాలు స్వగృహంలోనే జరుపుకోవాలనేది సర్వదా వ్యాప్తి చెందిన సూత్రం. అద్దె ఇంటి అగచాట్లు, నిలకడ లేని చిరునామా, అందంగా, పొందికగా సొంతఇల్లు ఉండాలనే కోరికలు, అభిరుచులు, తిన్నా తినక పోయినా గుట్టుగా తలదాచుకునే ఒక గూడు సమకుర్చుకోవాలనే తపన ... వెరిసి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి వ్యక్తి మదిలో ఏదో ఒక సమయాన ఉదయిస్తుంది.  పెళ్లి అయిన ప్రతివారు తమకంటూ ఒక ఇల్లు కావలనుకొంటారు. స్థలం తీసుకొని తనకు నచ్చినట్లు నాణ్యతగా ఇల్లు కట్టుకోవాలంటే ఈనాడు కుదిరే విషయం కాదు. అందుకే మనవారు 'ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు'  అని అన్నారు. ఈ నానుడి నేటి పరిస్థితులలో కొద్దిగా మార్చుకోవాలి,  'ఇల్లుకొని చూడు-పెళ్లిచేసి చూడు' అని అంటే వాస్తవానికి అతికినట్లు సరిపోతుంది.  అనేక మంది ముఖ్యంగా మధ్య తరగతి వారు, ఉద్యోగులు తమ జీవితకాలం కష్టించి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు బ్యాంకు  అప్పు జోడించి తమ ఆర్దికశక్తి తగ్గ అపార్టుమెంటును...

అపార్ట్ మెంట్స కి వాస్తు వర్తిస్తుందా?

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్సకు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది.  ఈ దేశవాళీ వాస్తు వల్ల అపార్టుమెంట్స నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈనాటి అపార్ట్ మెంట్సకు ఆనాటి మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు. ఈనాడు మన దేశంలో బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్మెంట్స దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ ఖండంలో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. అనేక దేశాలలో నేడు కోట్లాది మంది ఈ అపార్టుమెంట్లునందు నిక్షేపంగా జీవిస్తున్నారన్నది పరమ సత్యం. వీటి ఆకృతుల వెనుక మన వాస్తు సూత్రాలు ఏమాత్రం లేవన్నది కఠోర వాస్తవం. వాస్తును పరిగణలోనికి తీసుకొని ఈ సామూహిక గృహాలలో నివసించే వారందరికి కలగని కష్టనష్టాలు ఇక్కడ మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు.  నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని 'రెండు' ఇళ్లు కట్టుకోవటాన్ని గృహవాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తె...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...