గృహ విలాపం - Gruha Vilapam పండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు, అతిధి మర్యాదలకు రంగు రంగుల వలువలతో మేళ తాళాల సాక్షిగా తోడున్నా నీనెచ్చెలిగా ! రోగాల, రొస్తుల చావు బ్రతుకుల పోరాటంలో బాసటగా నీ కష్టాల కన్నీళ్లను నిశ్యబ్దంగా దిగమింగా ఓ ప్రాణ నేస్తంగా ! కంటికి రెప్పలా, కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా శైశవం నుండి కొన ఊపిరి దాక నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా ! చెప్పుడు మాటలు చెవికెక్కిన నీచేతిలో దగాపడి నడివీధిలో నాగుబాటుకు లోనైనా ద్రౌపదిలా నీ అసమర్ధ జీవనయానంలో కాలికి తగిలే ప్రతి రాయికి జన్మనిచ్చిన రాకాసి తల్లిగా ! ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ... నేరం నీదైతే ... వాస్తు దోషి గా నాకెందుకు ఈ మరణ శిక్ష ?
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.