Skip to main content

శ్రీనివాస్ వాస్తు నీతులు ( శ్రీ వా నీ లు )

శ్రీవానీలు srivaanelu - 1
(శ్రీనివాస్ వాస్తు నీతులు)


గాలివాన, వడగాలి 
కాచుకున్న ఇల్లు 
వాస్తు గాలికి 
కుప్ప కూలింది ! 

వాలు ,వీలు 
గాలి, వెలుగు 
ఇంటికి బలం 
వాస్తుతో బలమెందుకు ?


రోగాలు, రొస్టులకు 
వాస్తు వైద్యం !
దవాఖనాలెందుకు 
దండుగ ?


తూర్పు పడమర

బొమ్మా బొరుసు 
యెదై తేనేమి 
విలువ ఒక్కటేగా !


ప్రపంచమంతా
వాస్తు మయం
వెర్రివాడికి 
క్రొత్త కళ్ళజోడు !


ఇంటి కొలతలకు
వాస్తు గణితం 
అంకెల గారడిలో
రెండు రెళ్ళు ఆరు !


చేతికి కడియం 
నుదిటిన బొట్టు 
వాస్తు,జ్యోస్యాల వ్యాపారాల్లో
పగటి వేషగాళ్ళు ! 


కొంపలు కూల్చే 
దైవజ్ఞ, వాస్తు రత్న కిరీట 
చోర సిఖామణులున్నారు 
తస్మా ఇల్లు జాగ్రత్త!

దిక్కు తెలియక
దిక్సూచి పట్టాడు
కోటి విద్యలు
కూటి కొరకేగా !

ఇల్లు పీకీ 
పందిరి వెయ్యి ... 
వాస్తు వాగేవాడికి 
వినేవాడు వెంగలాయి !!!

Comments

Popular posts from this blog

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధ...

అమరావతి - ఆవశ్యకత - 8

మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు. 1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాల...

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ...