Skip to main content

ప్రభుత్వాలు - వాస్తు దోషాలు

ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇలాకాలో ఇదొక అంకం. దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి (దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) 2006లో కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకు (లేక్ వ్యూ గెస్ట్ హౌస్) వాస్తు దోషం ఉందని,అందుకే ఆయన కు పావురాల గుట్టలో అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ. (ఆనాడు వై.యస్.ఆర్. కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు (విద్వంసులు) తాజావాస్తు రిపోర్టు చూసి ఏమంటారో!) 
తాజా వాస్తు పోస్ట్ మార్టం రిపోర్ట్ను నమ్మి భవంతిలో ఉండటానికి భయపడిమద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించారు శ్రీ రోశియ్య గారు. సదరు సిద్దాంతి సలహాలతో దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారురిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు. వాస్తు హోమాలు, శాంతి పూజలు చేసి చివరికి 'కుడి కాలు' పెట్టారు. 'ఎడమ కాలు' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. అడ్డగోలుగా అన్ని లక్షలు పెట్టి వాస్తు రిపేరులు చేసిన తరువాత కుడా రోశియ్య గారికి ఇంకా వాస్తు భయం వదలక పోవటం ఆయన పిరికితనానికి ప్రత్యక్ష నిదర్శనం. మన దౌర్భాగ్యం. 
ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరిఇదే రోశియ్య గారు ఆర్ధిక మంత్రి గా ఉన్నప్పుడు వాస్తు పేరుతొ ప్రభుత్వ భవనాలకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటానికి ఒక ఉత్తర్వు జారి చేసినట్టు గుర్తు. తనదాక వస్తేగాని తనువు బయట పదన్నట్లుతనలో తిష్టవేసిన వాస్తు భయం పోగొట్టుకోవటానికి దాదాపు అరవై లక్షల ప్రజా ధనం తగలేసి మార్పు, చేర్పులు చేయించారుఅయినాకాని శంక పోలేదు. వాస్తు గిలితో శ్రీమాన్ రోశియ్య గారు ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సచివాలయానికి మధ్య తిరిగేటప్పుడు దారిలో బోలెడంత ట్రాపిక్ జామ్ అవుతుంది. అసౌకర్యాన్ని రోతలేకుండా భారించాల్సింది భాగ్యనగర ప్రజలే. ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా భవనం కట్టి నాలుగేళ్ళు కూడా పూర్తి కాలేదు. అసలు వాస్తు విషయంలో మన ప్రభుత్వ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. 
ప్రభుత్వం నిర్మించే/వినియోగించే భవనగృహల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? 
కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? మనుషులను బట్టి, పదవులను బట్టి వాస్తు మారుతుందా? 
ప్రభుత్వానికి అధికార వాస్తు పండితుడు అంటూ ఎవరైనా ఉన్నారా? ఉంటె అతను దేన్నిప్రామాణికంగా వాస్తు చెబుతాడు? భవిషత్ లో వచ్చే వాస్తు అనర్ధాలకు అతను భాద్యతతీసుకుంటాడా? ఇవి రోడ్లు,భవనాల శాఖ నియమావళికి అంటే సివిల్ ఇంజనీరింగ్ సూత్రాలకు అనుగుణంగా ఉందా? 

ఒక
వేళ ప్రభుత్వం వాస్తు పాటించదు అంటే , మరి నిబంధనల ప్రకారం వాస్తు మరమ్మతులు చేశారు?
ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడు ఎవ్వడు?
ఆచార్య  కొడాలి శ్రీనివాస్ 

Comments

Popular posts from this blog

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధ...

అమరావతి - ఆవశ్యకత - 8

మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు. 1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాల...

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ...