Skip to main content

వాస్తు లో వాస్తవాలు

ఆనాడు తిలక్ మహాశయుడు ప్రజలలో స్వేచ్చ స్వతంత్ర భావాలు రాగాల్చటానికి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టితే నేడు అవి ఒక మత క్రతువుగా, సమాజానికి ఒక గుది బండగా మారాయి. చందాల పేరుతో దండుకోవటం, ఊరేగింపుల పేరుతో తాగి తన్దనాలడటం నేడు ఒక తంతు గా మారింది. వీటికి విభిన్నంగా కృష్ణ జిల్లా పెడన గ్రామం లో శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం వారిచే గత 60 సంవత్సరాల నుండి నిర్విజ్ఞంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారు గణపతి పూజల తో పాటు ప్రతి రోజు ఒక అంశం పై జ్ఞాన సభ జరుపుతూ తిలక్ గారి స్పూర్తి ని కొనసాగించటం నిజంగా అభినందించ వలసిన విషయమే.
శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం, పెడన  వారు 23-09-2012 ఆదివారం నాటి జ్ఞాన సభలో నన్ను
'వాస్తు లో వాస్తవాలు' గురించి ప్రసంగించ వలిసినదిగా కొరగా ఆ వూరు వెళ్ళటం జరింగింది. 
 శ్రీ కుర్మా నాగభూషణం గారి అధ్యక్షతన జరిగిన ఆ సభలో నా ప్రసంగాన్నిఆద్యంతం ఆసక్తి విన్నారు. 
ఆస్తికులు వాస్తును నమ్మాలనటం కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి వాస్తు మతానికి ,దైవ భావానికి శుద్ధ వెతిరేకి. వాస్తు మార్పులు చేసుకుంటే ఇంటి స్వరూపం లో మార్పు వస్తుందేమో కాని మన జీవితాలలో ఎలాంటి మార్పు రాదు. అనవసర భయాలతో వాస్తు మర్మతులు చేస్తూ డబ్బు వృధా చేసుకోవద్దు. వాస్తు అనేది ఒకనాటి నిర్మాణ శాస్త్రం . యినాటి నిర్మాణాలకు పనికి రాదు అని గ్రహించాలని విజ్ఞప్తి చేసాను.ఆ ఊరిలో వాస్తు చెప్పుకొని జీవనం చేసేవారు అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్పి వాస్తు లో చోటు చేసుకున్న అసత్యాలను,అతిసయోక్తులను,అవగాహనారాహిత్యాలను సావధానంగా విరించటం జరిగింది.
 ఆ తరువాత 'సత్య వాగ్గేయం ' అనే జాతీయోద్యమ నాటకం పెద్దాపురం వారిచే ప్రదర్శింప బడినది.

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

రాజధాని - నగర వాస్తు -1

రాజ్యానికి రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది . రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి.  రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.  1. నగర వాస్తు "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం. వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'ద...

అపార్ట్ మెంట్స కి వాస్తు వర్తిస్తుందా?

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్సకు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది.  ఈ దేశవాళీ వాస్తు వల్ల అపార్టుమెంట్స నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈనాటి అపార్ట్ మెంట్సకు ఆనాటి మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు. ఈనాడు మన దేశంలో బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్మెంట్స దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ ఖండంలో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. అనేక దేశాలలో నేడు కోట్లాది మంది ఈ అపార్టుమెంట్లునందు నిక్షేపంగా జీవిస్తున్నారన్నది పరమ సత్యం. వీటి ఆకృతుల వెనుక మన వాస్తు సూత్రాలు ఏమాత్రం లేవన్నది కఠోర వాస్తవం. వాస్తును పరిగణలోనికి తీసుకొని ఈ సామూహిక గృహాలలో నివసించే వారందరికి కలగని కష్టనష్టాలు ఇక్కడ మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు.  నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని 'రెండు' ఇళ్లు కట్టుకోవటాన్ని గృహవాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తె...