Skip to main content

Posts

వాస్తు లో వాస్తవాలు

ఆనాడు తిలక్ మహాశయుడు ప్రజలలో స్వేచ్చ స్వతంత్ర భావాలు రాగాల్చటానికి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టితే నేడు అవి ఒక మత క్రతువుగా, సమాజానికి ఒక గుది బండగా మారాయి. చందాల పేరుతో దండుకోవటం, ఊరేగింపుల పేరుతో తాగి తన్దనాలడటం నేడు ఒక తంతు గా మారింది. వీటికి విభిన్నంగా కృష్ణ జిల్లా పెడన గ్రామం లో శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం వారిచే గత 60 సంవత్సరాల నుండి నిర్విజ్ఞంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారు గణపతి పూజల తో పాటు ప్రతి రోజు ఒక అంశం పై జ్ఞాన సభ జరుపుతూ తిలక్ గారి స్పూర్తి ని కొనసాగించటం నిజంగా అభినందించ వలసిన విషయమే. శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం, పెడన  వారు 23-09-2012 ఆదివారం నాటి జ్ఞాన సభలో నన్ను 'వాస్తు లో వాస్తవాలు ' గురించి ప్రసంగించ వలిసినదిగా కొరగా ఆ వూరు వెళ్ళటం జరింగింది.    శ్రీ కుర్మా నాగభూషణం గారి అధ్యక్షతన జరిగిన ఆ సభలో నా ప్రసంగాన్నిఆద్యంతం ఆసక్తి విన్నారు.  ఆస్తికులు వాస్తును నమ్మాలనటం కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి వాస్తు మతానికి ,దైవ భావానికి శుద్ధ వెతిరేకి. వాస్తు మార్పులు చేసుకుంటే ఇంటి స్వరూపం లో మార్పు వస్తుంద...

అపార్ట్ మెంట్స కి వాస్తు వర్తిస్తుందా?

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్సకు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది.  ఈ దేశవాళీ వాస్తు వల్ల అపార్టుమెంట్స నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈనాటి అపార్ట్ మెంట్సకు ఆనాటి మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు. ఈనాడు మన దేశంలో బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్మెంట్స దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ ఖండంలో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. అనేక దేశాలలో నేడు కోట్లాది మంది ఈ అపార్టుమెంట్లునందు నిక్షేపంగా జీవిస్తున్నారన్నది పరమ సత్యం. వీటి ఆకృతుల వెనుక మన వాస్తు సూత్రాలు ఏమాత్రం లేవన్నది కఠోర వాస్తవం. వాస్తును పరిగణలోనికి తీసుకొని ఈ సామూహిక గృహాలలో నివసించే వారందరికి కలగని కష్టనష్టాలు ఇక్కడ మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు.  నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని 'రెండు' ఇళ్లు కట్టుకోవటాన్ని గృహవాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తె...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...

రియల్ అడ్వేజర్

సిరాస్తి కి సంబంధించిన విషయాలతో  'రియల్ అడ్వేజర్'  అనే నూతన మాస పత్రిక మార్కెట్ లోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ కు సంభందించి అనేక అంశాలతో తెలుగులో పూర్తి మల్టికలర్ ఆఫ్ సెట్టింగ్ తో అందంగా రూపుదిద్దుకున్న ఈ మాస పత్రిక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పత్రికలో  ప్రతి నెల వాస్తుకు సంభందించిన విషయాల పై నా వ్యాసాలూ ప్రచురించ బడతాయి. 2011,జూన్ నెల పత్రిక లో  'వాస్తువు - శాస్త్రం'  అనే శీర్షిక తో నా వ్యాసం ప్రచురించ బడినది. ఆసక్తి ఉన్నవారు చదవగలరు. 

శ్రీనివాస్ వాస్తు నీతులు ( శ్రీ వా నీ లు )

శ్రీవానీలు srivaanelu - 2 ( శ్రీ నివాస్  వా స్తు  నీ తు లు ) వరదలు, వడదెబ్బలు కాచుకున్న ఇల్లు వాస్తు గాలికి  కుప్ప కూలింది ! రోగాలు, రోస్టులకు వాస్తు వైద్యం ! దవాఖనాలెందుకు దండుగ ?   ఆలి పై అనుమానం ఇంటి లో వంక  రోగం ఒక్కటే   మందు తినాలి ! ఇల్లు కట్టటం కష్టం  కులగోట్టటం కుటిలం  వాస్తు  బాట పడితే  చేరేది చింతల తోపుకే !  

ప్రభుత్వాలు - వాస్తు దోషాలు

ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇలాకాలో ఇదొక అంకం . దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ( దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) 2006లో  కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకు ( లేక్ వ్యూ గెస్ట్ హౌస్) వాస్తు దోషం ఉందని , అందుకే ఆయన కు  పావురాల గుట్టలో  అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ . ( ఆనాడు వై . యస్ . ఆర్ . కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు ( విద్వంసులు ) ఈ తాజావాస్తు రిపోర్టు చూసి ఏమంటారో !)   ఈ తాజా వాస్తు పోస్ట్ మార్టం రిపోర్ట్ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి ,  మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించారు శ్రీ రోశియ్య గారు . సదరు సిద్దాంతి సలహాలతో దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు .  రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు . వాస్తు హోమాలు , శాంతి పూజలు చేసి చివరికి ' కుడి కాలు ' పెట్టారు . ' ఎడమ కాలు ' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత ...

వాస్తు పై సెమినార్

మచిలీ పట్నం " డి . యం . యస్ .& యస్ . వి . హెచ్ . కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ లో ౨౮-౧-౨౦౦౯ తేదిన కొడాలి శ్రీనివాస్ గారు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్ధుల నుద్దేశించి ప్రసంగించారు . ప్రిన్సిపాల్ డా . కృష్ణ స్వామి గారు అద్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ప్రొఫ్ . జి . గిరిప్రసాద్ గారు నిర్వహించారు . పలువురు విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు ప్రొఫ్ . కొడాలి గారు ఇచ్చిన సమాదానాలు అందరి మన్ననలు పొందాయి .

వాస్తు దోషాలు !!!

ఈ దేశానికే వాస్తు సరిగా లేదని, అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు. మరొకడు రాష్ట్రానికి, ఇంకొకడు జిల్లాలకు, వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే, ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు. ఇలా గృహ వాస్తు రోజురోజుకి ముదిరి అనేక రంగాలలోకి దూరిపోతున్నది. దేశానికి అంటుకున్న ఈ వాస్తు తెగులుకు మందు వేయాలి, లేకుంటే జాతి నష్టపోయే ప్రమాదం ఉంది.  ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తీర్మానించి వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందు కుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.   నిరాశ, నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివే...

వాస్తు లో కుల బీజాలు !!!

వాస్తు లో కుల బీజాలు !!! హిందూ సమాజం లో లోతుగా వేల్లూ రుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో చాలా స్పష్టంగా కనబడతాయి . గ్రామా / పట్టణ / నగరాల లో ఏ వర్గం ( కులం / వర్ణం ) ఏ దిశలో ఉండాలో ఆనాటి వాస్తు గ్రంధాలల్లో చెప్ప బడింది .సమాజంలో ఆనాడున్న వృత్తులను బట్టి , జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది . దీనివల్ల తరతరాలగా మన సమాజం వర్గాలుగా , కులాలగా విభజింప బడినది . వృత్తు ల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్ని శాశ్వితం చేసాయి . వాస్తు శాస్త్రం లో చెప్పబడిన కొన్ని విషయాలను పరిశీలించితే కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి . బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు గ్రామ/పట్టణాలలో ఎలా వుండాలో ,ఎక్కడ ఉండాలో చెప్పటమే కాకుండా అక్కడ నేలకు రంగు , రుచి , వాసన , ఎలా వుండాలోకుడా చెప్పబడినది . ౧. బ్రాహ్మణ లు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి ౨. క్షత్రియ : తూర్పు దిశలో ఇల్లు/ వాకిలి ౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి ౪. శూద్ర : పడమర దిశలో ఇల్లు/ వాక...