Skip to main content

Posts

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 3

వాస్తు పుట్టుక  వాస్తు శాస్త్రం ఎప్పుడు పుట్టిందో, అది ఎప్పుడు గ్రంథస్థం చేయబడిందో తెలుసుకోవటానికి కొంత చారిత్రిక పరిశోధన చేయాలి. అయితే రావిపూడి గారు వాస్తు గ్రంథాలన్నీ 10 శాతాబ్దం తరువాతే వచ్చాయనే తలంపుతో వాస్తు 'ఆర్య వాస్తువా?' అంటూ అహేతుక వాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  ఆర్యులు నివసించిన గంగానది దక్షిణ తీర మైదానంలో (ఆర్యావర్తనం) భూమి ఏటవాలు తూర్పు మరియు ఉత్తర దిశలకూ ఉంది కాబట్టి వర్షపు నీరు, వాడుక నీరు సులభంగా పోవటానికి భూ ఉపరితల నీటి వాలు తూర్పు పడమరలకు ఉండాలనే సూత్రం ఏర్పడి ఉండవచ్చు అనే నా యుక్తీకరణకు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఆనాడు నివాస ప్రదేశం వరద ముంపుకు లోనుకాకుండా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో భూ ఉపరితల వాలుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికి వరదలకు, భారీ వర్షాలకు అనేక జనావాసాలు ముంపుకు గురిఅవుతున్న విషయం గమనించే ఉంటారు.  క్రీస్తు పూర్వం 1000-1500 సంవత్సరాల మధ్యలో గంగాతీరంలో ఆర్యులు జీవించారని, గుడిసెల్లో గుడారాలల్లో తిరిగిన ఈ దేశదిమ్మెరలకు వాస్తు శాస్త్రం తెలియదని, ఆతరువాత కీ.శ 5 శతాబ్దిలో నాటి జ్యోతిష్య, ఖగోళ గ్రంథాలైన కాలామృతం, బృహత్సంహ...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 2

ఏదైనా ఒక విషయం పై మనస్సులో ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడితే దానికి గురించిన విషయ పరిశీలనలో మరొకరి అభిప్రాయాలను పట్టించుకోరు. ఇలాంటి వారు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటూ ముందుగా  ఏర్పరుచుకున్న ఇనుప చట్రం లో దాన్ని బిగించి గిరగిరా తిప్పి చాకిరేవులో ఉతికి ఆరవేయటం నైజం. నిక్షపాక్షిక పరిశీలన లోపిస్తే నిజాలు మరుగున పడతాయి. ఇది రావిపూడి వారి వాస్తువు శాస్త్రమా? లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భూతాలు - దిక్కులు    వాస్తును అర్ధం చేసుకోవటానికి పాఠకులకు దానిలో ఉన్న పదాలను ముందుగా పరిచయం చేయటం పరిశోధనా గ్రంథాలలో తప్పని సరి అంశం. వాస్తువు గ్రంథ రూపంలో వచ్చేటప్పటికి (క్రీ.శ. 4-5 శతాబ్దాలు) పంచ భూతాలు మాత్రమే వారికి తెలుసు. చార్వాకులు నాలుగు భూతాలు అన్నారు, ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇవి ఏవి మూలకాలు కాదని చెప్పారని అంటూ రావిపూడి వారు అసలు విషయాన్ని ప్రక్కకు తీసుకువెళ్లడం వారి అసహనాన్ని మాత్రమే తెల్పుతుంది. అలాగే దిక్కులు, దిక్పాలకుల గురించి. ఆనాటి వారికి ఒక ప్రదేశాన్ని నాలుగు ప్రధాన దిక్కులతో నాలుగు విదిక్కులతో విభజించటమే తెలుసు. భూమిని 360 డిగ్రీల కోణంలో, ఒకడ...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష-1

ప్రముఖ హేతువాది శ్రీ రావిపూడి వెంకటాద్రి గారి రచన 'వాస్తువు శాస్త్రమా ?' పై 2001 లో నేను రాసిన ఈ సమీక్ష నాచే రచింపబడిన 'వాస్తులో ఏముంది?' మరియు 'వాస్తులో వాస్తవాలు' అనే పుస్తకాలపై వారు చేసిన విమర్శకు వివరణ ఇవ్వటమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని సరైన కోణంలో అవగాహన చేసుకోవటానికి, ఉపకరిస్తుంది భావిస్తున్నాను.  తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావని అన్నట్లే హేతువాదం పేరుతో గ్రంథ రచయిత చెప్పినవన్నీ వాస్తవాలు కావు. హేతువాది పత్రికలో 'వాస్తులో వాస్తవమెంత?' అనే శీర్షిక పేరుతో ప్రఫుల్ల చంద్ర గారు రాసిన వ్యాసాలను భూమికగా  చేసుకొని వాస్తుపై పెద్ద పుస్తకం రాయాలనే కుతితో ఈ పుస్తకాన్ని రాసినట్లు రావిపూడి గారు ముందుమాటలో చెప్పుకున్నారు. అలాగే పుస్తకానికి 'వాస్తులో వాస్తవమెంత?' అనే పేరు పెడితే వాస్తులో 'వాస్తవం' ఎంతో కొంత ఉంటుందేమోనని శంకతో దీనికి వాస్తువు శాస్త్రమా? అనే పేరు పెట్టారట. ఆహా ఏమి హేతువాదం? ఒక విషయం పై ముందే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తన వాదం నెగ్గటానికి వితండవాదం చేయటం వారికే చెల్లు. వాస్తు అనేది శాస్త్రం కాదు, కాదు, కానేకాదు అ...

అలుపెరుగని అమరావతి పోరాటం

ఆంధ్రుల ఆశాజ్యోతిగా ఆత్మగౌరవ చిహ్నంగా ప్రజా రాజధాని అమరావతిలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మొదలైన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకం. భూమి పుత్రులు మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఆంధ్ర జాతిని మేల్కొలిపింది. ఈ అమరావతి ఉద్యమం కుల మత ప్రాంతాలకుఅతీతంగా ఊరు వాడలను ఏకంచేసింది. ఆంధ్రుల ఆవేశం ఆరంభ శూరత్వం మాత్రమే అనే పాత నానుడికి అమరావతి లో జరుగుతున్న ఈ మహాఉద్యమం పాతర వేసింది. అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు ఎదురొడ్డి అడ్డుకట్ట వేసింది. బెజవాడ కనకదుర్గ ఆనతో నడుము కట్టిన నారీలోకం ఆత్మగౌరవ పోరాటంలో శంఖారావం పూరించి అగ్రభాగాన నిలిచి పొరాడు తున్నది. రాజ్యహింస చేసిన గాయాలతో మానసిక వేదనతో అసువులు బాసిన అరవై మంది అమరుల ఆత్మసాక్షిగా అహింసా మార్గంలో గాంధేయ స్ఫూర్తిగా బడుగు,బలహీన వర్గాల రైతులు కూలీలు,విద్యార్థులు, మేధావులతో సాగుతున్న ఈ ఉద్యమం విజయం సాధించి చరిత్ర పుటలలో నిలిచి పోతుంది. భావి పోరాటాలకు స్ఫూర్తిగా ఉంటుంది.  మోసం అనేది చాలీచాలని దుప్పటిలాంటిది. తల కప్పుకుంటే కాళ్లు, కాళ్లు కప్పుకుంటే తల కనిపిస్తుంది. అభివృద్ధికి అధికార వికేద్రీకరణ అంటూ చాలీచాలని దుప్పట్లో దూరిన పాలక నేతలు మూడు రాజధానులు పేరుతో పలుకు...

అమరావతి - ఆవశ్యకత - 8

మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు. 1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాల...

అమరావతి - ఆవశ్యకత -7

రాయల సీమ రాజకీయం నిజం చెప్పులు తొడుగుకొని బయటికి వచ్చేసరికే అబద్దం ఆరు సార్లు ఊరంతా తిరిగి వస్తుందనేది జగమెరిగిన నానుడి. అమరావతి పై అసూయతో రాజకీయ లబ్దికొరకు కొందరు అదేపనిగా అనేక అబాండాలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు.   కావలి కాసే కుక్కను చంపాలనుకొనే వారు దానికి పిచ్చి అని చెప్పి తలొక రాయి వేసినట్లు అమరావతిని భ్రమరావతిగా ప్రచారం చేశారు. ఇక్కడ కుల పిచ్చి ఉందని నిజానిజాలు నిర్దారణ జరగకుండానే తీర్పులు చెప్పటం విచారకరం.  ఇలా కొంతమంది రాయలసీమ పెత్తందారులు కోస్తా ఆంధ్రపై ముఖ్యంగా ఈ అమరావతి కృష్ణ తీరప్రాంతంపై విషం చిమ్మటం గత 90 సంవత్సరాలనుండి గమనిస్తున్నదే. 1926 లో విజయవాడలో నెలకొల్పిన ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని తమ ప్రాంతంలో పెట్టలేదనే అక్కసుతో విశాఖపట్నం తరలించటం లో సీమకు చెందిన మేధావి సి.ఆర్ రెడ్డి పాత్ర అనితరసాధ్యం. ఆంధ్రతో కలిసి ఉండటానికి శ్రీ బాగ్ ఒప్పందం పేరుతో పదవుల కొరకు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వారి మద్య ఒక చట్టబద్దత లేని ఒప్పందం కుదుర్చికొని విజయవాడలో ఉండాలిసిన రాజధానిని కర్నూలుకు తీసుకుపోయారు. మరల వారి స్వలాభం చూసుకొని హైదరాబాదుతో ఒప్పందం చేసుకొని ...

అమరావతి - ఆవశ్యకత - 6

సమస్యలు చుట్టుముట్టినపుడు , అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది. మంచి ఎదో చెడు ఎదో తెలియజేయవలిసిన బాధ్యత ఉంటుంది. సమస్యను పరిష్కారం చేయలేనప్పుదు దాన్ని గజిబిజి చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టే పరిపాలకులకు దశా దిశా నిర్దేశం చూపించాలి. తెలుగు వారి క్షేమం,అభివృద్ధి కోరేవారు అమరావతి రాజధానిపై స్పందించాలి. 1. మంచికో చెడుకో అమరావతిలో నూతన రాజధాని ఉండాలని స్థూలంగా అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. ప్రణాళికలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాప్రదేశం ఎంపికలో ఏకాభిప్రాయం ఉంది. దేశ నలుమూలల నుండి పవిత్ర జలాలు, పుట్ట మన్ను తెచ్చి ప్రదేశాన్ని శుద్ధి పరిచి, పెద్దలందరి సమక్షంలో ప్రధాని స్వహస్తాలతో అమరావతికి శంఖు స్థాపన చేశారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు, ప్రజా ఆమోదంతో మొదలు పెట్టిన పనికి అందరు నిబద్దతతో కట్టుబడి ఉండాలి. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు అని ఆనాడు అంగీకరించి మౌనంగా ఉన్న వ్యక్తులు ఈనాడు ఆక్షేపించటం సరికాదు. 2. రైతుల నుండి సమీకరించబడ్డ భూమిని తిరిగి యధాస్థితికి తెచ్చి వారికి ఇవ్వటం ఇప్పుడు అసాధ్యం. రైతులకు వచ్చిన స్థలాలు కొన్ని అమ్మకాలు కూడా జరిగాయి. ...

అమరావతి - ఆవశ్యకత - 5

ఆవేశం ఆలోచనను అణిచివేస్తుంది. అభిమాన దురాభిమానాలు వివేకాన్ని, విచక్షణను పోగొడతాయి. కక్షలు,కార్పణ్యాలు జాతిని దహించివేస్తాయి. ఈర్షా ద్వేషాలు, పగ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారతాయి. అనుమానాలు, అపనమ్మకాలు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తాయి. వ్యక్తిగతంగానే కాక సామాజకపరంగాకూడా వీటిని దరిచేయకుండా విజ్ఞతను చూపాలి. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పురుడు పోసుకుంటున్న క్రమంలోవస్తున్న సంకుచిత వాదనలలో ఇటువంటి పోకడలే కనిపిస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం.  1. కర్నూలు లో హైకోర్టు  ఒకనాడు తెలుగుజాతి అంతా ఐక్యంగా ఉండాలని,దానికొరకు రాజధానిని రెండుసార్లు త్యాగం చేసిన కోస్తా ఆంధ్రులు నేడు రాజధాని తమ ప్రాంతంలో ఉండాలనుకోవటం న్యాయబద్ధమైన కోరిక. రాజధానిలోనే హైకోర్టు ఉండాలనే భావనతో 1956లో గుంటూరులో ఉన్న హైకోర్టు హైదారాబాద్ పోయింది. ఆనాడు రాజధాని ఒకచోట, హైకోర్టు మరొక చోట ఉండాలన్న వాదన సరికాదని, రాజధానిలో హైకోర్టు అంతర్భాగమని శ్రీభాగ్ ఒప్పందం చేసుకొన్నా అదే పెద్ద మనుషులు భావించటం, గుంటూరులో ఉన్న హైకోర్టు తిన్నగా హైదరాబాదు చేరటం చారిత్రిక వాస్తవం. ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన శ్రీభాగ్ ఒప్ప...

అమరావతి - ఆవశ్యకత - 4

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే శుభతరుణంలో కొంతమంది సంకుచిత వాదనలతో కుల, ప్రాంత భేదాలను రేపుతూ ప్రమాదకర రాజకీయ క్రీడను మొదలుపెట్టటం గర్హనీయం. పసలేని పనిమాలిన ఆ వాదనలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం.  1. రాజధాని విస్తీర్ణం ఎక్కువా?  రాజధానికి అంత భూమి ఎందుకు? కేవలం 13 జిల్లాల నవ్యంధ్రకు 35 వేల ఎకరాల తో పెద్ద రాజధాని కావాలా?  ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప రాజధానికి ఇంకేం ఉంటాయి ?  దానికొరకు ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా? ఇత్యాది కుటిల ప్రశ్నలతో అమరావతిని కుంగదీస్తున్న వారు వాస్తవాలు గ్రహించాలి.  అమరావతి కేవలం అవశేష 13 జిల్లాలకు మాత్రమే రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల హృదయస్పందన అనే స్పృహ ఉండాలి. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి, వైభవానికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.   ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు, తెలుగు భాషకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పురుడుపోసుకుంటున్న ఈ నగరం రాబోయే రోజులలో కావలిసిన అవసరాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుగా సమీకరించ బడినద...

అమరావతి - ఆవశ్యకత - 3

చేఎత్తి జే కొట్టు తెలుగోడా , గతమెంతో ఘనకీర్తి గలవోడా .. అనే ప్రబోధ గీతం తో ఒకనాడు నిద్రాణస్థితి నుండి మేల్కొన్న జాతి , ఆత్మ గౌరవనినాదంతో కదం తొక్కిన తెలుగు జాతి విభజనతో దగాపడితే ఆత్మవిశ్వాసం కలిగించి అభిమానంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకొన్ననేలఅమరావతి. ఇది బుద్దిమాధవ్యం గలవారికి భ్రమరావతిగా కనిపించవచ్చు.అలాంటి వారి భ్రమలు తొలగి సౌమ్య అమరావతిగా నూతన తేజస్సుతో నవ్యఆంధ్ర రాజధానిగా అవతరిస్తుంది. ఆంద్ర జాతి ఉన్నంతవరకు అమరావతి శాశ్వితంగా ఉండటానికి ఉపకరిస్తున్న అనేక సాంఘిక, ఆర్థిక కారణాలతో పాటు రాజకీయ, నైసర్గిక, నైతిక విషయాలు ప్రస్తావించుకుందాం. 1. రవాణా సదుపాయాలు a) విజయవాడ లో 1888 లో ప్రాంభించబడి దాదాపు 132 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న అతి పేద్ద రైల్వే కూడలి ఉంది. 22 ట్రాక్స్ తో ,10 ఫ్లాట్ ఫార్మ్స్ నుండి ప్రతి రోజు 1.5 లక్షల ప్రయాణికులకు సేవచేస్తూ దేశంలోనే 4వ అతి పెద్ద స్టేషన్ గా విలసిల్లుతుంది. b) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు సేవలందించి 2003లో పౌర విమానాశ్రయంగా మారి దినదినాభివృద్ధి చెందుతున్న గన్నవరం విమానాశ్రయం జోడవటం అమరావతికి కలిసివచ్చిన అంశం. c) జాతీయ రహదారులు NH - 16,( చెన్నై-కల...

అమరావతి - ఆవశ్యకత -2

1.అమరావతి నగర ప్రణాళిక  అమరావతి రాజధానికి గా ఉండటానికి దానికి కున్న చారిత్రిక వైభవం మాత్రమే కాక ఇతర యోగ్యతలను పరిశీలిద్దాం. రాజధానికి అనువైన ప్రాంతం గురించి పలు అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో అందరు చర్చించే వాటిలో వాస్తు అనుకూలతలు ఒకటి. ఇక్కడ ఇంటికి సంభందించిన వాస్తు విషయాలను వదిలి రాజధానికి సంబంధించిన వాటినే ప్రస్తావిస్తాను. వాస్తు ప్రస్తావనలు    "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం.  వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ /నగర వాస్తు ' పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండలపై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని, అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే 'భూ దుర్గం' అని వర్గీకరించారు. వీటిలో శత్రు భయం లేని చోట భూ దుర్గాలు నిర్మించటం సర్వ శ్రేష్టం అని చెప్పబడింది. రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండ...

అమరావతి - ఆవశ్యకత -1

1.అమరావతికి అంకురార్పణ ఏ రాజ్యానికైనా ఒక రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు ఒక రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది. రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకతో గత ప్రభుత్వం అందరి ఆమోదంతో అసంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి అమరావతికి అంకురార్పణ చేయటం అందరికి విదితమే. దానికి రైతులనుండి భూసమీకరణ పద్దతిలో 34 వేల ఎకరాల భూమిని సమకూర్చుకోవటం , ఇప్పటివరకు 8 వేల కోట్ల ప్రజా ధన్నాన్ని వెచ్చించి కొంతవరకు నిర్మాణాలను చేయటం జరిగింది. అయితే గత ఎన్నికలలో ప్రభుత్వం మారటంతో " రెడ్డి వచ్చే ... మొదలిడు" అన్న చందాన రాజధాని విషయం మళ్ళీ మొదలకు వచ్చింది. ఇలాంటి సంకట స్థితిలో ప్రజలు విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి. అమరావతి నిర్మించాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలుసుకోవాలి. రాజధాని రూపురేఖలు గురించి మాట్లా...

NATIONAL SURVEY DAY – 2016

"జాతీయ సర్వే దినం -2016" సందర్బంగా విజయవాడ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ వారిచే 11-04-2016 న అమరావతి అమరిక,నిర్మాణంలో సర్వేయింగ్ పాత్ర  అనే అంశం పై  నేను ప్రధాన ప్రసంగం చేశాను. దాని వివరాలు.        The Institution of Engineers (India)              96 years of Relentless Journey Towards Engineering Advancement for Nation Building                                        Vijayawada Local Center   NATIONAL SURVEY DAY – 2016 Brief note on the Technical Talk on ROLE OF SURVEYING IN PLANNING AND CONSTRUCTION OF AMARAVATHI The Vijayawada Local Center of the Institution of Engineers (India) organized National Survey Day – 2016 at its premises on Monday, the 11 th  April, 2016 at 18.30 hrs.  Er. V Gopal, FIE ...

చైనా వాస్తు -ఫెంగ్ షుయి

నీవు నైరాశ్యం లో జీవిస్తున్నావు అంటే భూతకాలంలో, ఆందోళనలో గడుపుతూ ఉంటే భవిషత్ కాలంలో, ప్రశాంతంగా జీవిస్తున్నావు అంటే వర్తమానంలో బ్రతుకుతున్నావని తెలుసుకొ ... అని చైనా తత్వవేత్త తావో ఉపదేశం.   ఈ తత్వం తలకెక్కక తల్లడిల్లే వారెందరో. కష్టనష్టాల ఊబిలో ఊపిరి సలపనివారు, ఆశా భయాల ఊయలలో ఉగిసలాడేవారు వివేకం కోల్పోయి దప్పికతో ఉన్న దుప్పుల్లా ఎండమావుల వెంట పరుగులు పెడుతుంటారు.  సర్వ సంపదలకు, కర్మ ఫలాలకు మన దేశవాళి వాస్తు దారి చూపిస్తుందనే వాస్తు విధ్వంసుల విన్యాసాలతో జరిగిన గృహాల విధ్వంసంతో కుదేలైన జనం తాజాగా చైనా బాటపట్టారు.  కొత్త ఒక వింత - పాత ఒక రోత అన్నట్లు మన పాత వాస్తును వదిలి చైనా వారి సాంప్రదాయక వాస్తు మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు. చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ అనికూడా పిలుస్తారు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రాలు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.   తైజీతు యంగ్-య...