Skip to main content

Posts

Showing posts from 2015

చైనా వాస్తు -ఫెంగ్ షుయి

నీవు నైరాశ్యం లో జీవిస్తున్నావు అంటే భూతకాలంలో, ఆందోళనలో గడుపుతూ ఉంటే భవిషత్ కాలంలో, ప్రశాంతంగా జీవిస్తున్నావు అంటే వర్తమానంలో బ్రతుకుతున్నావని తెలుసుకొ ... అని చైనా తత్వవేత్త తావో ఉపదేశం.   ఈ తత్వం తలకెక్కక తల్లడిల్లే వారెందరో. కష్టనష్టాల ఊబిలో ఊపిరి సలపనివారు, ఆశా భయాల ఊయలలో ఉగిసలాడేవారు వివేకం కోల్పోయి దప్పికతో ఉన్న దుప్పుల్లా ఎండమావుల వెంట పరుగులు పెడుతుంటారు.  సర్వ సంపదలకు, కర్మ ఫలాలకు మన దేశవాళి వాస్తు దారి చూపిస్తుందనే వాస్తు విధ్వంసుల విన్యాసాలతో జరిగిన గృహాల విధ్వంసంతో కుదేలైన జనం తాజాగా చైనా బాటపట్టారు.  కొత్త ఒక వింత - పాత ఒక రోత అన్నట్లు మన పాత వాస్తును వదిలి చైనా వారి సాంప్రదాయక వాస్తు మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు. చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ అనికూడా పిలుస్తారు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రాలు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.   తైజీతు యంగ్-యాన్ చిహ్నం  మనిషి మనుగడకు గాలి, నీరుకు ఉన్న ప్రాముఖ

గృహ విలాపం

గృహ విలాపం - Gruha Vilapam పండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు, అతిధి మర్యాదలకు రంగు రంగుల వలువలతో  మేళ తాళాల సాక్షిగా తోడున్నా నీనెచ్చెలిగా ! రోగాల, రొస్తుల చావు బ్రతుకుల పోరాటంలో బాసటగా నీ  కష్టాల కన్నీళ్లను  నిశ్యబ్దంగా దిగమింగా  ఓ  ప్రాణ నేస్తంగా !   కంటికి రెప్పలా, కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా  శైశవం నుండి కొన ఊపిరి దాక నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా ! చెప్పుడు మాటలు చెవికెక్కిన నీచేతిలో దగాపడి  నడివీధిలో నాగుబాటుకు లోనైనా ద్రౌపదిలా  నీ అసమర్ధ జీవనయానంలో కాలికి తగిలే ప్రతి రాయికి  జన్మనిచ్చిన రాకాసి తల్లిగా ! ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ... నేరం నీదైతే ...  వాస్తు  దోషి గా నాకెందుకు ఈ మరణ శిక్ష ?

రాజధాని - నామకరణం

పేరులో ఏముంది? అనేవారు కొందరైతే పేరులోనే ఉన్నది పెన్నిది అనేవారు మరికొందరు. ప్రపంచం ఆశ్చర్యపడేలా ఆంధ్రులకు అద్భుత రాజధాని కావాలని కాంక్షించే వారికి దానికి తగిన పేరు కుడా ఉన్నతంగా ఉండాలని ఉబలాటపడటం సహజమే.  మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టటం అన్ని విదాల ఆమోదయోగ్యమైన నిర్ణయం.  అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవ

వాస్తు భూతం మళ్లీ పుట్టింది

బంగారు తెలంగాణలో భాగ్య నగరం నడిబొడ్డున ఓ గాడిద గుడ్డేట్టింది.  ఆదివారం అమావాస్య అర్దరాత్రి సమయంలో  ఆ గార్దాభాండం బద్దలై దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రిలో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా మూడు దినాలు కురిసింది. నాలాలు ఉప్పొంగి ఊరు వాడ ఏకమై సముద్రాన్ని తలపించింది.  ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితులు బంగారు భూమికి భూత కీడు దాపురించినదని, ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని సెలవిచ్చిచారు.  ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందోనని తెరాసురల అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభి జండాలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోరగాళ్ళు, లావక్కంత లేని న్యాయవాదులు, స్వరనినాదవాగేకారులు, అస్తమానం లొల్లి పెట్టె శ్రామిక, కర్షక, కార్మిక, కు

నాయకులకు వాస్తు భయాలు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తు వశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి. దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది.  ఈనాడు సౌజన్యంతో   తెలంగాణ ముఖ్య మంత్రి KCR కు వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తు పిచ్చి ఉంటె వారి సొంత ఇంటికి అదీ చాలకపోతే తెరాస పార్టీ భవనంకు సరి చేసుకోవాలి.పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వక్ర దృష్టి సచివాలయం పై పడింది.  ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట. చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట.  అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వాస్తు భవనం కడతాడట.  ఇన్నాళ్ళు బాగున్న సచివాలయం వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదో వివరించాలి. గలీజు చరిత్ర వాస్తుతో పోతుందా? ఒక వేళ సచివాలయం వాస్తు కుద

రాజధాని - నగర వాస్తు -2

రాజధాని - నగర వాస్తు -1 లో    నవ్యాంద్ర రాజధాని నగర నిర్మాణం లో స్థల ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాలు దీనిలో పరిశీలించుదాం.   ఆంధ్రులకి చాల పురాతన ఘనచరిత్ర ఉంది. ధాన్యకటకం (అమరావతి) నుండి హంపీ విజనగరం వరకు ఎన్నోసార్లు రాజధానులు నిర్మించుకున్న నైపుణ్యం, శక్తి, యుక్తి కలిగిన జాతి. ఆనాటి మన రాజధానులు వాస్తు శాస్త్రం లో ఉన్న సూత్రాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి అనుటలో సందేహం లేదు.   వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు.  రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి.  అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి) వృత్తాకారంలో కాని చతురస్రాకారం

రాజధాని - నగర వాస్తు -1

రాజ్యానికి రాజు ఆయన నివాసానికి, రాజ్య పాలనకు రాజధాని ఉండటం ఒక విధానం. రాజులు రాజ్యాలు పోయినా దేశాలకు, రాష్ట్రాలకు పరిపాలనా కేంద్రాలగా నేడు రాజధానులు పనిచేస్తున్నాయి. రాజ్య నిర్మాణంలో రాజధాని ఆవశ్యకత ఎంతో ఉంది. చరిత్రలో ఎంతో మంది రాజులు రాజధానులు నిర్మించిన వైనం మనకు విదితమే. అలాంటి చరిత్రాత్మకమైన మరొక సంఘటన నేడు ఆంధ్రుల ముంగిట నిలుచుంది . రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో విజ్ఞత చూపించాలి. రాజకీయాన్ని పక్కన పెట్టాలి. ఐక్యతను చాటాలి.  రాజధాని రూపురేఖలు గురించి మాట్లాడేఅర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.ఈనాడు రాజధాని రాజకీయం పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.  1. నగర వాస్తు "వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం. వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'ద