Skip to main content

Posts

Showing posts from 2010

శ్రీనివాస్ వాస్తు నీతులు ( శ్రీ వా నీ లు )

శ్రీవానీలు srivaanelu - 2 ( శ్రీ నివాస్  వా స్తు  నీ తు లు ) వరదలు, వడదెబ్బలు కాచుకున్న ఇల్లు వాస్తు గాలికి  కుప్ప కూలింది ! రోగాలు, రోస్టులకు వాస్తు వైద్యం ! దవాఖనాలెందుకు దండుగ ?   ఆలి పై అనుమానం ఇంటి లో వంక  రోగం ఒక్కటే   మందు తినాలి ! ఇల్లు కట్టటం కష్టం  కులగోట్టటం కుటిలం  వాస్తు  బాట పడితే  చేరేది చింతల తోపుకే !  

ప్రభుత్వాలు - వాస్తు దోషాలు

ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇలాకాలో ఇదొక అంకం . దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ( దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) 2006లో  కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకు ( లేక్ వ్యూ గెస్ట్ హౌస్) వాస్తు దోషం ఉందని , అందుకే ఆయన కు  పావురాల గుట్టలో  అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ . ( ఆనాడు వై . యస్ . ఆర్ . కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు ( విద్వంసులు ) ఈ తాజావాస్తు రిపోర్టు చూసి ఏమంటారో !)   ఈ తాజా వాస్తు పోస్ట్ మార్టం రిపోర్ట్ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి ,  మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించారు శ్రీ రోశియ్య గారు . సదరు సిద్దాంతి సలహాలతో దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు .  రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు . వాస్తు హోమాలు , శాంతి పూజలు చేసి చివరికి ' కుడి కాలు ' పెట్టారు . ' ఎడమ కాలు ' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత భవనం లోనేనట